టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా గబ్బర్ శనివారం ఓ వీడియోను పంచుకున్నాడు. 12 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌కు అండగా నిలిచిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ), ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డిడిసిఎ)లకు శిఖర్ ధావన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. దేశవాళీ క్రికెట్‌కు కూడా దూరంగా ఉంటానని చెప్పిన గబ్బర్.. ఐపిఎల్‌కు వీడ్కోలు పలకడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. టీమిండియాకు ఆడటం తన కలని, అది నేరవేరిందని, సంతృప్తికరంగా తన కెరీర్‌ను ముగిస్తున్నానని శిఖర్ ధావన్ వీడియోలో పేర్కొన్నాడు. 2010- వరకు భారత్ తరఫున శిఖర్ ధావన్ 167 వన్డేలు, 34 టెస్ట్‌లు, 68 టీ20లు ఆడాడు.
విరిగిన వేలితో శతకం : వన్డేల్లో 6793, టెస్ట్‌ల్లో 2315 పరుగులు చేశాడు. టీ20ల్లో 1759 రన్స్ చేసిన గబ్బర్.. వన్డేల్లో 17, టెస్ట్‌ల్లో 7 సెంచరీలు నమోదు చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2015 వన్డే ప్రపంచకప్, 2017 ఛాంపియ న్స్ ట్రోఫీ, ఆసియా కప్ 2018లో శిఖర్ ధావ న్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముఖ్యంగా ఐసీసీ టో ర్నీల్లో శిఖర్ ధావన్‌కు మెరుగైన రికార్డు ఉంది. 20 19 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో విరిగిన బొ టన వేలితో శతకం సాధించాడు. రోహి త్ శర్మతో కలిసి వన్డేల్లో అత్యధిక పరుగుల భాగస్వా మ్యం నె లకొల్పిన రికార్డును కూడా అందుకున్నా డు. ఈ ఇద్దరూ 115 ఇన్నింగ్స్‌ల్లో 5148 ప రుగు లు చే శారు. ధావన్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో గంభీర్ ఆడుతాడా? లేక క్రికెట్‌కు పూర్తి గా దూరంగా ఉంటాడా? అనేదానిపై స్పష్టత లేదు.
హైదరాబాద్ తరఫున : ఐపిఎల్‌లో శిఖర్ ధావన్ డెక్కన్ ఛార్చర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటి వరకు 222 మ్యాచ్‌లు ఆడిన శిఖర్ ధావన్..6768 పరుగులతో సెక్‌ండ హయ్యె స్ట్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్లో ఐదు మ్యాచ్ లు మాత్రమే ఆడిన ధావన్.. చివరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడాడు. పంజాబ్ కింగ్స్ కు సారథిగా ఉన్న ధా వన్.. భుజ గాయంతో పూర్తి స్థాయిలో జట్టుకు అందుబాటులో ఉండలేకపోయాడు. దాంతో పం జాబ్ 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పా యింట్స్ యింట్స్ 9వ స్థా నంలో నిలిచింది. గబ్బ ర్ షేర్ చేసిన వీడియోలో ఐపీఎల్ గురించి ప్రస్తావించలేదు. కానీ పంజాబ్ కింగ్స్ జెర్సీ, సన్‌రైజర్స్ షీల్డ్ చూపించాడు.
ఐపిఎల్‌కు గుడ్‌బై చెప్పినట్లే :మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం.. థ్యాంక్యూ శిఖర్ ధావన్ అని అతని ఎడిటెట్ ఫొటోను షేర్ చేసింది. ఈ పోస్ట్‌ను చూస్తుంటే ఐపిఎల్‌కు కూడా గబ్బర్ వీడ్కోలు పలికినట్లు అర్థమవుతోంది. గబ్బర్ను కొనసాగించేందుకు పంజాబ్ కింగ్స్ కూడా సముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ గబ్బర్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని భావిస్తే విదేశీ టి20 లీగ్స్‌తో పాటు లెజెండ్స్ క్రికెట్ టోర్నీల్లో కనిపించే అవకాశం ఉంది.
క్రికెట్‌కు గబ్బర్ గుడ్‌బై..
RELATED ARTICLES