జెరుసలేం:అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చారు… ఎలాంటి ఫలితాన్ని సాధించకుండానే వెనుదిరిగారు.. ఇజ్రాయెల్ గడ్డపై అ డుగుపెట్టడానికి ముందు కాల్పుల విరమణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, గాజా స్ట్రిప్‌లో శాంతి స్థాపన జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కానీ, అలాంటి అద్భుతాలు ఏమీ జరగలేదు. ఇజ్రాయెల్ తన పట్టు వీడలేదు. హమాస్ ఉగ్రవాదులను ఏరి వేస్తున్నట్టు గతంలో చేసినప్రకటనను కొనసాగిస్తూ, గాజా లో పాలస్తీనా ప్రజలపై దాడులను ఆ పడం లేదు. మధ్యప్రాచ్యంలో శాంతి అత్యవసరమని పేర్కొన్న బ్లింకెన్ ఏ దశలోనూ ఇ జ్రాయెల్‌ను కాల్పుల విరమణకు ఒప్పించలేకపోయారు. ఆయన ఇ జ్రాయెల్‌లో సాధించింది ఏమిటో ఆయనకే తెలియని పరిస్థితి. అమెరికా, ఈ జిప్టు, ఖతార్ ప్రతినిధుల బృందం గత వారం దోహలో సమావేశమై చర్చలు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈవారం కైరోలో సమావేశం కానుండగా, బ్లింకెన్ కూడా ఆ సమావేశానికి హాజరవుతారని సమాచారం. చర్చల్లో ఇప్పటి వరకూ పురోగతి లేదన్నది వాస్తవం.ఇజ్రాయెల్‌లోఏమీసాధించలేకపోయిన బ్లింకెన్, కైరోలో ఏం చేస్తారన్నది ప్రశ్న. ఖతార్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్‌తో నామమాత్రపు సమావేశం జరిగింది. అతను కైరో వెళ్లి, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసితో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఖతార్‌కు బయలు దేరతారు. ఇజ్రాయెల్ నుంచి ఒక్క హామీని కూడా పొందకుండానే వెనుదిరిగిన బ్లింకెన్ మీడియాతో మాట్లాడుతూ గాజా స్ట్రిప్‌లో స్థాపనకు కృషి కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దీర్ఘకాలిక ఆక్రమణలను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని అన్నారు. కాగా, పాలస్తీనాకు అంతర్జాతీయ మద్దతు అవసరమని ఈజిప్టు అధ్యక్షుడు ఎల్‌సిసి అన్నారు. కాల్పుల విరమణను తక్షణమే ప్రకటించాలని బ్లింకెన్‌ను కలిసిన తర్వాత మాట్లాడుతూ ఎల్‌సిసి డిమాండ్ చేశారు. శాంతి దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.