తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయన్’ మరోసారి అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. టీజే.జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ ఓ సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజినీ మరోసారి అభిమానులను థ్రిల్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాలో మళయాల నటుడు ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, దుషార విజయన్, రితికా సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.