HomeNewsLatest Newsసిద్దిపేటలో టెన్షన్‌..టెన్షన్‌..

సిద్దిపేటలో టెన్షన్‌..టెన్షన్‌..

కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ ఫ్లెక్సీ వార్‌..
పోటాపోటీగా రెండు పార్టీలు నిరసన ర్యాలీలు

ప్రజాపక్షం/సిద్దిపేట ప్రతినిధి
సిద్దిపేట జిల్లా కేంద్రంలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల పోటాపోటీ నిరసన ర్యాలీలతో శనివారం ఉదయం నుండి సిద్దిపేటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు ర్యాలీ, నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. బిఆర్‌ఎస్‌ నాయకులు ర్యాలీగా వచ్చి అంబేద్కర్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహించి సిఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీని దహనం చేయగా, పోలీసులు బిఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు సైతం ర్యాలీగా వచ్చి ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయం వద్ద హరీష్‌రావు ఫ్లెక్సీని చింపి వేయటంతో పోలీసులు కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించటంతో సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం రాత్రి సిఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2లక్షల రుణమాఫీ చేసిండని.. హరీశ్‌రావు నీ రాజీనామా ఎక్కడ అని సిద్దిపేటలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హరీశ్‌రావుకు వ్యతిరేకంగా టి బోర్డుపై ఫ్లెక్సీ ఏర్పాటు చేయటంతో బిఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం బిజెఆర్‌ చౌరస్తాలో రాత్రి 11 గంటలకు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌కు, సిఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ నాయకులు సైతం బిజెఆర్‌ చౌరస్తాలో బిఆర్‌ఎస్‌కు, హరీష్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిఆర్‌ఎస్‌ నేతలు టి బోర్డుపై మాజీ మంత్రి హరీష్‌రావుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ప్లెక్సిని తొలగించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అదే బిఆర్‌ఎస్‌ నేతలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో పోలీసులు బిఆర్‌ఎస్‌ నేతలను వ్యాన్‌లో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదే క్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కొంతమంది ఎంల్‌ఎ క్యాంపు కార్యాలయం గేటు తాళం ధ్వంసం చేయగా గోడ దూకి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు క్యాంపు కార్యాలయంకు ఉన్న కెసిఆర్‌, హరీష్‌రావు ప్లెక్సిలను చింపి వేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రి నుండి సిద్దిపేటలో ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది.
* నల్లకండువాలతో బిఆర్‌ఎస్‌ ర్యాలీ- సిఎం రేవంత్‌రెడ్డి ప్లెక్సి దగ్థం చేసిన బిఆర్‌ఎస్‌ నేతలు
శనివారం ఎంఎల్‌ఎ తన్నీరు హరీష్‌రావు క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్‌ నాయకులు చొరబడి ప్లెక్సి చింపటానికి నిరసనగా మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, జిల్లా నేతలు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, పాల సాయిరాంతో వందలాది నాయకులు,కార్యకర్తలు క్యాంపు కార్యాలయం నుండి పాత బస్టాండ్‌ వరకు నల్ల కండువాలతో ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ చౌరస్తాలో ధర్యా నిర్వహించి ఆనంతరం సిఎం రేవంత్‌రెడ్డి ప్లెక్సిని దహనం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి. సిఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆనంతరం హరీష్‌రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సిలను బిఆర్‌ఎస్‌ నేతలు తొలగించారు.
* ఎంఎల్‌ఎ హరీష్‌రావు క్యాంపు కార్యాలయం తీవ్ర ఉద్రిక్తత- పలువురు అరెస్టు
* క్యాంపు కార్యాలయం వద్ద రేవంత్‌రెడ్డి ప్లెక్సి ఏర్పాటుకు యత్నించిన కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్న బిఆర్‌ఎస్‌ నేతలు
సిద్దిపేట కాంగ్రెస్‌ ఇంచార్జి పూజల హరికృష్ణ నేతృత్వంలో కాంగ్రెస్‌ నాయకులు ఎంఎల్‌ఎ హరీష్‌రావు క్యాంపు కార్యాలయం ముట్డడి, క్యాంపు కార్యాలయంలో రేవంత్‌రెడ్డి ప్లెక్సిని ఏర్పాటు చేసేందుకు పెద్దఎత్తున తరలిరావటంతో బిఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు క్యాంపు కార్యాలయంలోకి చోచ్కుకొని వచ్చేందుకు యత్నించటంతో బిఆర్‌ఎస్‌నేతలు అడ్డుకోవటంతో తోపులాటకు దారితీసింది. క్యాంపు కార్యాలయంలోకి వచ్చిన కాంగ్రెసు నేతలకు బిఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకొని దేహశుద్ది చేశారు. ఆనంతరం పోలీసులు జోక్యం చేసుకొని కాంగ్రెస్‌ నాయకులను అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
* సిపికి ఫిర్యాదు చేసిన బిఆర్‌ఎస్‌ నేతలు
కాంగ్రెస్‌ నాయకులు ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయం గేటు ధ్వంసం చేసి, మాజీ మంత్రి హరీష్‌రావు, కెసిఆర్‌ ప్లెక్సిల తోలగింపుపై బిఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ నాయకులపై పోలీస్‌కమిషనర్‌కు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, నాయకులు భూపేశ్‌,వేణుగోపాల్‌రెడ్డి, సాయిరాం ,కౌన్సిలర్లు తదిరతులు ఫిర్యాదు చేశారు. పట్టణంలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. ఆనంతరం సిపి సానుకూలంగా స్పందించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటానని హామీనిచ్చినట్లు తెలిపారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments