HomeNewsBreaking Newsజొయిటిస్‌ విస్తరణ

జొయిటిస్‌ విస్తరణ

హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ నుంచి కార్యకలాపాలు
వందలాది మందికి కొత్త ఉద్యోగాలు
అమెరికాలో సిఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయిన కంపెనీ ప్రతినిధులు
ప్రజాపక్షం / హైదరాబాద్‌
ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జొయిటిస్‌ కంపెనీ హైదరాబాద్‌లో తమ కెపాబులిటీ సెంటర్‌ను విస్తరించాలని నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచే ఈ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. హైదరాబాద్‌లోని జొయిటిస్‌ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, మంత్రి డి.శ్రీధర్‌బాబుతో పాటు అధికారుల బృందంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో తమ జోయిటిస్‌ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించే నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని అన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయన్నారు. వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫ్యూచరిస్టిక్‌ టెక్నాలజీలో జోయిటిస్‌ రంగ ప్రవేశం హైదరాబాద్‌కు మరింత గుర్తింపు తెస్తుందన్నారు. ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్‌ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని జోయిటిస్‌ కంపెనీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ కీత్‌ సర్బాగ్‌ అన్నారు. తమ కంపెనీ విస్తరణ జంతు ఆరోగ్యానికి సంబంధించి సరి కొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడుతుందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments