HomeNewsNationalమేం గుడ్డివాళ్ళం కాదు, క్షమించేదిలేదు

మేం గుడ్డివాళ్ళం కాదు, క్షమించేదిలేదు

రామ్‌దేవ్‌బాబా యాడ్స్‌కేసులో సుప్రీం మండిపాటు
న్యూఢిల్లీ : యోగా గురు రామ్‌దేవ్‌ బాబా ప్రకటనల కేసులో ఆయన దాఖలు చేసిన క్షమాపణ లేఖను సుప్రీంకోర్టు తిస్కరరించింది. న్యాయస్థానం గుడ్డిది కాదని, ఈ క్షమాపణ లేఖను సమ్మతించేదిలేదని స్పష్టం చేసింది. రామ్‌దేవ్‌ బాబా చేసిన చర్యను ఉద్దేవపూర్వకమైదిగా విమర్శించింది. ఈ విషయంలో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని కూడా మండిపడింది. రామ్‌దేశ్‌ బాబా ప్రకటనల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న కేసులోఆయన కోర్టుకు క్షమాపణలు చెప్పాల్సిందేనని గతంలోనే ధర్మాసనం స్పష్టం చేసింది. అదేసమయంలో ఈ క్షమాపణలను అంగీకరించేదిలేదని కూడా వెల్లడించింది. తమ వైద్య ఉత్పత్తులు అద్భుతాలు సృష్టిస్తాయంటూ అలవికాని, మితిమీరినస్థాయిలో ప్రజలను తప్పుతోవ పట్టించేవిధంగా ప్రకటనలు ఇవ్వడంపై సుప్రీంకోర్టులో పతంజలి ఆయుర్వేదపై కేసు నమోదైంది. ఈ కేసులో జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అసదుద్దీన్‌ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం పైవిధంగా స్పందించింది. యోగా గురురామ్‌దేశ్‌ బాబా, ఆయన కంపెనీ పతంజలి ఆయుర్వేదకు చెందిన మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ బుధవారం క్షమాపణలు తెలియజేస్తూ దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు ఆయన బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలనీ, ఐతే ఆ క్షమాపణలను సమ్మతించేదిలేదని కూడా సుప్రీంకోర్టు ఇంతకుముందే వెల్లడించింది. ఐతే ప్రభుత్వం అనుసరిస్తున్న లైసెన్సింగ్‌ విధానాన్ని కూడా ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది.ఈ విషయాన్ని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని హెచ్చరించింది. “మేం తేలిగ్గా తీసుకోవడంలేదు, ఈ విషయం మొత్తం నిగ్గు తేలుస్తాం” అని పేర్కొంది. షోకాజ్‌ నోటీసు జారీ చేసిన తర్వాత వారిని ప్రత్యక్షంగా కోర్టుకు హాజరుకావాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. కానీ వారు తప్పించుకునే
ప్రయత్నం చేస్తున్నారని ధర్మాసనం విమర్శించింది. ఈ కేసులో తృణీకరణభావంతో వ్యవహరిస్తున్న ఈ ఇద్దరికీ సంబంధించిన మొత్తం గత చరిత్ర విషయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని, వారు తీరిగ్గా దాఖలు చేసిన అఫిడవిట్‌ను సమ్మతించే విషయంలో తమకున్న మినహాయింపులనను వ్యక్తం చేశామని పేర్కొంది. తదుపరి ఈ కేసు విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసులో రామ్‌దేవ్‌ బాబా, బాలకృష్ణలు మొదట క్షమాపణలు చెప్పాల్సింది కోర్టుకు కాదనీ, మీడియాకు క్షమాపణలు తెలియజేయాలని ధర్మాసనం మొదటే చెప్పింది. చాలా ఆలస్యంగా ఈ క్షమాపణల అఫిడవిట్‌ దాఖలు చేశారని విమర్శించింది. రాష్ట్ర లైసెన్సింగ్‌ అధారిటీకి చెందినవారంతా మొద్దునిద్రలో కూరుకుపోయారని విమర్శించింది. ఈ క్రియారాహిత్యానికి కారణం ఏమిటో వివరణ ఇవ్వాలని కోరింది. మా ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశరని కోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీకి స్పష్టం చేసింది. రామ్‌దేశ్‌ బాబా, బాలకృష్ణ వేరు వేరుగా క్షమాపణలు తెలిజేస్తూ రెండు అఫిడవిట్‌లు దాఖలు చేశారు. ఏ వైద్య ఉత్పత్తులైనా మార్కెటింగ్‌చేసేటప్పుడు ఇకమీదట చట్టాలను ఉల్లంఘించకూడదని, తమ తమ బ్రాండ్ల ప్రకటనల విషయంలో కూడా మితి మీరిన అతిశయోక్తులు ప్రదర్శించకూడదని ధర్మాసనం నవంబరు21న జారీ చేసిన ఉత్తర్వులలో స్పష్టం చేసింది. మీడియా వార్తలనుగానీ, తమ ఉత్తర్వులను గానీ పతంజలి కంపెనీ లక్ష్యపెట్టకపోవడంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో పతంజలి సంస్థకు వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపైనే ఈ విచారణ కొనసాగుతున్నది. ఆ సంస్థ ఉత్పత్తుల చెల్లుబాటు విషయంపై నిగ్గదీస్తూ వేసి ప్రశ్నలకు రామ్‌దేశ్‌ కోర్టుకు స్పష్టమైన సమాధానాలు చెప్పడంలో గడచిన మార్చి 19న విఫలమయ్యారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments