మాణిక్ సర్కార్
అగర్తలా : లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి, ఇండియా కూటమి నేతృత్వంలో ప్రజాస్వామ్య, లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలకు సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు. పశ్చిమ త్రిపుర పార్లమెంట్ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇండియా కూటమి అభ్యర్థి అశీష్ కుమార్, అగర్తలా అసెంబ్లీ నియ్జోకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న రతన్‌దాస్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాణిక్ సర్కార్ పాల్గొని ప్రసంగించారు. అధికార బిజెపి దుష్టపాలనపై ఆయన మండిపడ్డారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, అరకొర వేతనాలు, విద్య ప్రైవేటీకరణ, ఆరోగ్యం వంటి మొదలైనవి దేశంలో ప్రబలంగా ఉన్నాయని, అందుకే ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు మద్దతు పలకాలకు మాణిక్ విజ్ఞప్తి చేశారు. ‘ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. కంపెనీలు మూతపడుతున్నాయి. శ్రామిక వర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు లోక్‌సభ ఎన్నికల పోరు, మరోవైపు ఉనికి కోసం పోరాటం చేస్తున్నారన్నారు. సమావేశాలకు హాజరుకాకుండా, రాజకీయ ప్రసంగాలు వినకుండా కుటుంబ సభ్యులను సంఘటితం చేయాలని ప్రజలను కోరారు. ‘2023 (అసెంబ్లీ ఎన్నికలు)లో ఏమి జరిగిందో మీరు చూశారా?… మీకు కావాలా? ’ అని ప్రశ్నిస్తూ కచ్చితంగా దీనిని ఎవరూ కోరుకోరన్నారు. అందరు తప్పకుండా ఓటు వేయాలని మాజీ సిఎం కోరారు. తాము మీతోనే ఉన్నామని, మిమ్మలను ఎవరైనా అడ్డుకుంటే రోడ్డుపై కూర్చొని నిరసన తెలపాలని సూచించారు.
బిజెపి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలి
RELATED ARTICLES