ప్రజాపక్షం/నందికొండ మిషన్ భగీరథ తాగునీటి అవసరాల నిమిత్తం ఉన్నతాధికారుల సూచనల మేరకు సోమవారం సాయంత్రం నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఎడమ కాలువ లాల్ బహుదూర్ కెనాల్ నుండి తెలంగా ణ ప్రజల దాహార్తిని తీర్చేందు కు డ్యామ్ అధికారులు నీటి ని విడుదల చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిలువ సామర్థం తక్కువగా ఉన్నందున ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసమే వాడుకోవాలని, ఒక్క నీటి చుక్కను కూడా వృథా చేయకూడదని అధికారులు తెలిపారు. అయితే ఈ నీటిని ఎన్ని టిఎంసిల వరకు విడుదల చేస్తారనేది తెలియాల్సి ఉంది.
సాగర్ రిజర్వాయర్ సమాచారం… : నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఇది 312.50 టిఎంసిలకు సమానం. ప్రస్తుత నీటిమట్టం సోమవారం సాయంత్రం నాటికి 513.40 అడుగులు, 137.5158 టిఎంసిలుగా ఉంది. అయితే ప్రస్తుతానికి రిజర్వాయర్ నుంచి ఎడమ కాలువ ద్వారా 2500 క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లో గా విడుదల అవుతూ ఉండగా రిజర్వాయర్‌కు ఎటువంటి ఇన్ ఫ్లో రావటం లేదు. అదేవిధంగా ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి ఎటువంటి విద్యుత్తు ఉత్పత్తి జరగడం లేదు.
తాగునీటి అవసరాలకు సాగర్ ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల
RELATED ARTICLES