ఎస్‌ఐబి చీఫ్ మొదలు సిఐల వరకూ లింకులు
మాజీ డిఎస్‌పి ప్రణీత్ విచారణలో వెలుగులోకి
ఫోన్ ట్యాపింగ్‌లో వరంగల్ పోలీసులే కీలకం?
జిల్లా కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్
ప్రజాపక్షం/హన్మకొండ ప్రతినిధి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగానే సాగినట్లు తెలుస్తున్నది. ఈ కేసులో కీలక పాత్ర పోషించి అరెస్టు అయిన మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును విచారిస్తున్నా కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసులతో ఉన్నలింకులు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. దీంతో ఈ కేసు జిల్లా పోలీసులను నిద్ర లేకుండా చేస్తున్నది. ఏ రోజు ఎవరి పేరు బయటికి వస్తుందోనని నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అధికార పక్షంతో అంటకాగిన పోలీసు అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్‌తో సహా మిగిలిన అధికారులంతా వరంగల్ వారు కావడంతో పాటు జిల్లాలోని పర్వతగిరిలో ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా వార్ రూం ఏర్పాటు చేయడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. ఈ వ్యవహారంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్టు చేసి విచారణ జరుపుతుండడంతో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన నిందితుడు డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావుది వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండలం మేడిపల్లి
కాగా అతని అమ్మగారి ఊరు పర్వతగిరి.అలాగే బీఆర్‌ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించి ఎస్‌ఐబి చీఫ్‌గా పని చేసిన టి.ప్రభాకర్ రావుది హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం. ప్రభాకర్ రావు 2020 జూన్ 30న పదవీ విరమణ చేయగా నాటి సీఎం కేసిఆర్‌కు ఉన్న సత్సంబధాలతో రాష్ట్ర ఎస్‌ఐబి చీఫ్‌గా నియమించినట్లు చెబుతున్నారు. పై అధికారుల సూచన మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు చెప్పడంతో హైదరాబాద్‌లోని మాజీ ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేపట్టడం వరంగల్ పోలీసులలో చర్చనీయాంశమైంది. ఇదే చర్చ జరుగుతున్న క్రమంలో భూపాలపల్లి ఏఎస్పీ భుజంగరావు సైతం ఫోన్ ట్యాపింగ్‌లో భాగస్వాములు అయ్యారంటూ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఇద్దరు సీఐలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు, ఇప్పటికే వారిని కూడా పోలీసులు విచారణ కోసం అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. మాజీ ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మొదలుకొని మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, భూపాలపల్లి ఏఎస్పీ భుజంగరావు, ప్రణీత్‌కు సహకరించిన ఇద్దరు సీఐల వరకూ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వారే కావడంతో ఈ కేసులో జిల్లా పోలీసులలో ఉత్కంఠ రేపుతున్నది. వీరితో పాటు ఫోన్‌ట్యాపింగ్ కోసం ఎంచుకున్న వార్ రూమ్ కూడా జిల్లాలోని పర్వతగిరి కావడంతో ఈ వ్యవహారం అంతా వరంగల్ చుట్టూ తిరుగుతున్నది. కాగా జిల్లా పోలీసులతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ప్రణీత్ రావు బందువు అన్న ప్రచారం జరుగుతుండడంతో బీఆర్‌ఎస్ నాయకులలోనూ ఆందోళన వ్యక్తం అవుతున్నది. మరోవైపు ఎర్రబెల్లి స్వగ్రామం పర్వతగిరి కావడం, పర్వతగిరిలోనే వార్ రూమ్ ఏర్పాటు, ఫోన్ ట్యాపింగ్‌లు జరిగినట్లు పోలీసులు గుర్తించడం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. దయాకర్ రావు, దుగ్యాల ప్రణీత్ రావు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మద్య బందుత్వం ఉందన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏఏ రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల ఫోన్ కాల్స్ రికార్డు చేశారో, ఏ కాంట్రాక్టర్,వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేశారోనన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. హైదరాబాద్‌లో ఎస్‌ఐబి కార్యాలయంతో పాటు వరంగల్ జిల్లాలోని పర్వతగిరిలో వార్ రూమ్ ఏర్పాటు చేయడం, దుగ్యాల ప్రణీత్ జిల్లాకు చెందిన వాడు కావడంతో ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ పై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దృష్టి పడింది. కాగా అతని అమ్మగారి ఊరు పర్వతగిరి.అలాగే బీఆర్‌ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించి ఎస్‌ఐబి చీఫ్‌గా పని చేసిన టి.ప్రభాకర్ రావుది హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం. ప్రభాకర్ రావు 2020 జూన్ 30న పదవీ విరమణ చేయగా నాటి సీఎం కేసిఆర్‌కు ఉన్న సత్సంబధాలతో రాష్ట్ర ఎస్‌ఐబి చీఫ్‌గా నియమించినట్లు చెబుతున్నారు. పై అధికారుల సూచన మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు చెప్పడంతో హైదరాబాద్‌లోని మాజీ ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేపట్టడం వరంగల్ పోలీసులలో చర్చనీయాంశమైంది. ఇదే చర్చ జరుగుతున్న క్రమంలో భూపాలపల్లి ఏఎస్పీ భుజంగరావు సైతం ఫోన్ ట్యాపింగ్‌లో భాగస్వాములు అయ్యారంటూ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఇద్దరు సీఐలకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు, ఇప్పటికే వారిని కూడా పోలీసులు విచారణ కోసం అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. మాజీ ఎస్‌ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మొదలుకొని మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, భూపాలపల్లి ఏఎస్పీ భుజంగరావు, ప్రణీత్‌కు సహకరించిన ఇద్దరు సీఐల వరకూ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వారే కావడంతో ఈ కేసులో జిల్లా పోలీసులలో ఉత్కంఠ రేపుతున్నది. వీరితో పాటు ఫోన్‌ట్యాపింగ్ కోసం ఎంచుకున్న వార్ రూమ్ కూడా జిల్లాలోని పర్వతగిరి కావడంతో ఈ వ్యవహారం అంతా వరంగల్ చుట్టూ తిరుగుతున్నది. కాగా జిల్లా పోలీసులతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ప్రణీత్ రావు బందువు అన్న ప్రచారం జరుగుతుండడంతో బీఆర్‌ఎస్ నాయకులలోనూ ఆందోళన వ్యక్తం అవుతున్నది. మరోవైపు ఎర్రబెల్లి స్వగ్రామం పర్వతగిరి కావడం, పర్వతగిరిలోనే వార్ రూమ్ ఏర్పాటు, ఫోన్ ట్యాపింగ్‌లు జరిగినట్లు పోలీసులు గుర్తించడం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. దయాకర్ రావు, దుగ్యాల ప్రణీత్ రావు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మద్య బందుత్వం ఉందన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏఏ రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల ఫోన్ కాల్స్ రికార్డు చేశారో, ఏ కాంట్రాక్టర్,వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేశారోనన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. హైదరాబాద్‌లో ఎస్‌ఐబి కార్యాలయంతో పాటు వరంగల్ జిల్లాలోని పర్వతగిరిలో వార్ రూమ్ ఏర్పాటు చేయడం, దుగ్యాల ప్రణీత్ జిల్లాకు చెందిన వాడు కావడంతో ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ పై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దృష్టి పడింది.
పోలీసులను వణికిస్తున్న ఫోన్‌ట్యాపింగ్
RELATED ARTICLES