ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములు చేసే బాధ్యత తమదని, మల్కాజిగిరి ప్రచార మోడల్, రాష్ట్రమంతా అనుసరించేలా ఉండాలలని ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. లోక్‌సభ నియోజకవర్గా ల సమీక్షలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం అతిథి గృహంలో కాంగ్రెస్ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తనకు కొడంగల్, మల్కాజిగిరి రెండు నియోజకవర్గాలు రెండు కళ్ల లాంటివన్నారు. కొడంగల్‌కు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తున్నామో, అంతే సమానంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలకు, ముఖ్య నాయకులకు డిసిసి అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పది మందితో కూడిన కమిటీ వేయాలని సూచించారు. నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులందరికీ ఏదో ఒక విధంగా పదవులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. పార్టీ కోసం పని చేసిన నాయకులకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పదవులు కూడా ఉన్నాయన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టిపిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కిగౌడ్, ఎంఎల్‌సి పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతారెడ్డి, మాజీ ఎంఎల్ఎ సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు, రంగరెడ్డి డిసిసి అధ్యక్షులు నర్సింహారెడ్డి, తదితరులు ముఖ్యనాయకులు హాజరయ్యారు.
కష్టపడే వారిని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తాం
RELATED ARTICLES