HomeNewsTelanganaరూఫ్‌టాప్‌ సోలార్‌ స్కీమ్‌కు రూ.75,021 కోట్లు

రూఫ్‌టాప్‌ సోలార్‌ స్కీమ్‌కు రూ.75,021 కోట్లు

కేంద్ర కేబినెట్‌ ఆమోదం : రూ.78,000 వరకు సబ్సిడీ
ఖరీఫ్‌ సీజన్‌కు ఎరువులపై సబ్సిడీ
న్యూఢిల్లీ:
దేశ వ్యాప్తంగా అర్హత కలిగిన సుమారు కోటి కుటుంబాలకు ఉచితంగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించడానికి రూ.75,021 కోట్లతో రూఫ్‌టాప్‌ సోలార్‌ స్కీమ్‌ను కేంద్ర ప్రభు త్వం ఆమోదించింది. ‘పిఎం సూర్య ఘుర్‌… ముఫ్త్‌ బిజిలీ’ పేరుతో కొనసాగే ఈ పథకానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ పథకం కోసం కేంద్రం అత్యధికంగా రూ. 78,000 వరకు సబ్సిడీని అందించనుంది. కేబినెట్‌ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రూఫ్‌టాప్‌ సోలార్‌ను అమర్చడానికి ఈ పథకం వీలు కల్పిస్తుందన్నారు. ఫిబ్రవరి 13న ప్రధాన మంత్రి ఈ పథకాన్ని ప్రారంభించిన విషయాన్ని ఆయ న గుర్తుచేశారు. కాగా, ఈ పథకం 2 కెడబ్ల్యు సిస్టమ్స్‌కు 60 శాతం, 2 కెడబ్ల్యు నుంచి 3 కెడబ్ల్యు సామర్థ్యంగల సిస్టమ్స్‌కు అదనుపు సిస్టమ్‌ ఖర్చు లో 40 శాతం చొప్పున కేంద్రం ఆర్థిక సాయం (సిఎఫ్‌ఎ)ను అందిస్తుంది. అయితే, ఈ సిఎఫ్‌ఎ 3 కెడబ్ల్యు వద్ద పరిమితమవుతుంది. ప్రస్తుత బెంచ్‌మార్క్‌ ధరల ప్రకారం 1 కెడబ్ల్యు సిస్టమ్‌కు రూ. 30,000, 2 కెడబ్ల్యు సిస్టమ్స్‌కు రూ. 60,000, 3 కెడబ్ల్యు లేదా అంతకంటే ఎక్కువ సిస్టమ్స్‌కు రూ 78,000 సబ్సిడీ ఉంది. ఈ పథకం కింద కుటుంబాలు నేషనల్‌ పోర్టల్‌ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుంటాయి. రూఫ్‌టాప్‌ సోలార్‌ను ఏర్పాటు చేసుకోవడానికి తగిన విక్రేతను ఎంచుకుంటారు. అవసరమైన సిస్టమ్‌ పరిమాణాలు, ప్రయోజనాలను లెక్కించి, తదనుగుణంగా సిబ్సిడీని పొందగలుగుతారు. ఈ పథకం ద్వారా, గృహాలు విద్యుత్‌ బిల్లులను ఆదా చేయగలవు. డిస్కమ్‌లకు మిగులు విద్యుత్ను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందగలవు. 3 కెడబ్ల్యు వ్యవస్థ ఒక ఇంటికి సగటున 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలదు. ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకునుంచి వివరాలు తెలుసుకోవచ్చు.
ఖరీఫ్‌ సీజన్‌కు ఎరువులపైసబ్సిడీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌
ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎరువులపై సబ్సిడీకి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఫాస్ఫేటిక్‌, పొటాసిక్‌ (పి అండ్‌ కె) ఎరువులపై రూ. 24,420 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రైతులకు కీలకమైన నేల పోషకమైన డిఎపిని క్వింటాల్‌కు రూ. 1,350 చొప్పున అందచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డిఎపి (డై అమోనియమ్‌ ఫాస్ఫేట్‌)తోపాటు, ఇతర ప్రధాన పి అండ్‌ కె ఎరువుల రిటైల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పిఅండ్‌ కె ఎరువులపై 2024 ఖరీఫ్‌ సీజన్‌ (ఏప్రిల్‌ 1 నుండి సెప్టెంబర్‌ 30 వరకు)లో పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్‌) రేట్లను నిర్ణయించడానికి ఎరువుల శాఖ ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈసారి సబ్సిడీని 24,420 కోట్ల రూపాయలుగా నిర్ధారించింది. నత్రజని (ఎన్‌) కిలోకు రూ.47.02, ఫాస్ఫేటిక్‌ (పి)పై రూ.28.72, పొటాసిక్‌ (కె) కిలోకు రూ.2.38, సల్ఫర్‌ (ఎస్‌)పై కిలోకు రూ.1.89 సబ్సిడీగా నిర్ణయించారు. వాస్తవానికి ఫాస్ఫేటిక్‌ ఎరువులపై సబ్సిడీని 2023 రబీ సీజన్‌లో కిలోకు రూ.20.82 నుంచి 2024 ఖరీఫ్‌ సీజన్‌కు రూ.28.72కి పెంచారు. అయితే, నత్రజని (ఎన్‌), పొటాసిక్‌ (కె), సల్ఫర్‌ (ఎస)పై సబ్సిడీని 2024 ఖరీఫ్‌ సీజన్‌లో మార్చలేదు. డిఎపిపై దిగుమతిపై రైతాంగం ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఎన్‌బిఎస్‌ పథకం కింద మూడు కొత్త ఎరువుల గ్రేడ్లను చేర్చాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఎరువుల తయారీదారులు/దిగుమతిదారుల ద్వారా ప్రభుత్వం 25 గ్రేడ్ల పి అండ్‌ కె ఎరువులను సబ్సిడీ ధరలకు రైతులకు అందుబాటులో ఉంచుతోంది. పి అండ్‌ కె ఎరువులపై సబ్సిడీ 2010 నుండి ఎన్‌బిఎస్‌ పథకం ద్వారా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
మూడు సెమీకండక్టర్‌ ప్లాంట్లకు ఆమోదం
ఎలక్ట్రాన్సిక్స్‌, ఆటోమొబైల్‌ రంగంతో పాటు శాస్త్రసాంకేతిక రంగంలో ఎంతో కీలకమైన సెమీకండక్టర్‌ తయారీకి చేయూతనిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే దేశంలో మూడు సెమీకండక్టర్ల ప్లాంట్లనను ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్‌ గురువారం పచ్చజెండా ఊపింది. కేంద్ర ఐ అండ్‌ బి మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రకటనను అనుసరించి వంద రోజుల్లో నిర్మాణాలు ప్రారంభిస్తారు. మొదటి కమర్షియల్‌ సెమీ కండక్టర్‌ ఫ్యాబ్‌ని టాటా- పవర్‌ చిప్‌ తైవాన్‌ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్లాంట్‌ గుజరాత్‌లోని ధోలేరాలో ఉంటుంది. రూ. 27,000 కోట్లతో అస్సాంలోని మోరిగావ్‌లో టాటా సెమీకండక్టర్‌ అసెంబ్లీ, టెస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ని ఏర్పాటు చేస్తుంది. సిజి పవర్‌, జపాన్‌కు చెందిన రెనెసాస్‌ ఎలక్ట్రానిక్స్‌ కార్ప్‌, థాయ్లాండ్‌కు చెందిన స్టార్స్‌ మైక్రోఎలక్ట్రానిక్స్‌ భాగస్వామ్యంతో గుజరాత్‌లోని సనంద్‌లో మరో సెమీకండక్టర్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మూడు ప్లాంట్ల మొత్తం పెట్టుబడి రూ. 1.26 లక్షల కోట్లు. ఈ మూడు కలిసి ఏడాదికి దాదాపుగా 3 బిలియన్‌ చిప్లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments