ప్రజాపక్షం/హైదరాబాద్ ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల నేపథ్యంలో ఈనెల 26న (సోమవారం) సిబిఐ విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి ఆహ్వానించడం, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధాన్ని కలిగిస్తోందన్నారు. ఈ మేరకు సిబిఐకి కవిత ఆదివారం లేఖ రాశారు. సిఆర్‌పిసి సెక్షన్ 41 ఎ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని, లేదా ఉప సంహరించుకోవాలని ఆ లేఖలో కవిత పేర్కొన్నారు. ఒక వేళ సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే
విచారణకు హాజరుకాలేను వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. సిఆర్‌పిఎస్ సెక్షన్ 41 ఎ కింద తనకు నోటీసులు ఇవ్వడం సరికాదని, ఈ సెక్షన్ కింద తనకు ఎందుకు నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు. 2022 డిసెంబర్‌లో అప్పటి జిఒ ఇదే తరహా సెక్షన్ 160 ప్రకారం నోటీసును జారీ చేశారన్నారు. గతంలో తనకు ఇడి నోటీసులు జారీ చేస్తే, తాను సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించానని, ప్రస్తుతం ఈ కేసు కోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్నదని, సిబిఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని, పైగా ఈ కేసు కోర్ట్‌లో పెండింగ్‌లో ఉన్నదని కవిత వివరించారు. తనను విచారణకు పిలువబోమని అదనపు సొలిసీటర్ జనరల్ సుప్రీంకోర్టకు హామీనిచ్చారన్నారు. సుప్రీంకోర్ట్‌లో ఇచ్చిన హమీ సిబిఐకి కూడా వర్తిస్తుందన్నారు. గతంలో సిబిఐ బృందం తమ ఇంటికి వచ్చి విచారించారని, కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు విచారణకు ఆహ్వానించడం, సెక్షన్ల మార్పు పట్ల అనేక అనుమానాలకు తావి స్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తనకు కొన్ని బాధ్యతలను అప్పగించిందని, రానున్న ఆరు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైందని కవిత తెలిపారు.
విచారణకు హాజరుకాలేను సిబిఐకి ఎంఎల్‌సి కవిత లేఖ
RELATED ARTICLES