HomeNewsTelanganaత్వరగా మూసీ శుద్ధి ప్రక్రియ

త్వరగా మూసీ శుద్ధి ప్రక్రియ

వెంటనే ప్రారంభించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
‘మూసీ నదీ పరీవాహక అభివృద్ధి’పై సమీక్ష
నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచన
ప్రజాపక్షం/హైదరాబాద్‌
మూసీ అభివృద్ధి అంశంపైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. విలైనంత త్వరగా పనులు పూర్తయ్యేలా వేగవంతంగా చర్యలు చేపట్టింది. మూసీ అభివృద్ధిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే లండన్‌లోని థ్యేమ్స్‌ నది, గుజరాత్‌లోని నర్మద నదినీ పరిశీలించిన ప్రభుత్వం, ముందుగా మూసీ నదిని పరిశుభ్రం చేసే పక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ‘మూసీ నదీ పరీవాహక అభివృద్ధి’పైన నాన్‌క్‌రామ్‌గూడలోని హెచ్‌ఎండిఎ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో హెచ్‌ఎండిఎ కమిషనర్‌ ధానకిషోర్‌, హెచ్‌ఎండిఎ జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలి, హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండి ఎన్‌.వి. ఎస్‌.రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసీ రివర్‌ బౌండరీస్‌ లొకేషన్‌ స్కెచ్‌తో పాటు పలు వివరాలను అధికారులు సిఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సిఎం సూచించారు. అధికారులకు పని విభజన చేసి, మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ముందుగా మూసీ నది పరిశుభ్రం చేసే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కాగా అధికార బృందం గుజరాత్‌లోని నర్మద నదిని సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించింది. మూసీ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆరా తీసింది. ఆ తర్వాత లండన్‌ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ‘లండన్‌ థ్యెమ్స్‌’ను పరిశీలించారు. ఈ సందర్భంగా లండన్‌ సంస్థతో సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు .థ్యేమ్స్‌ ప్రత్యేకతను , ఆ తరహామూసీ నది అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సిఎం రేవంత్‌ రెడ్డి అధికారులతో చర్చించారు. అనంతరం తాజగా మూసీ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి, అధికార యంత్రాంగానికి సిఎం రేవంత్‌ పలు సూచనలు చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments