బ్యారేజీ నుంచి ఖాళీ చేస్తున్న నీరు
10 గేట్లు ఎత్తివేత
2.8 టిఎంసి నిల్వ నీరు దిగువకు విడుదల
ప్రజాపక్షం/కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ తరహాలోనే అన్నారం బ్యారేజీలో పగుల్లు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల నివేదిక మేరకు బ్యారేజీ అధికారులు నిల్వ నీటిని గేట్లు ఎత్తి దిగువకు తరలిస్తున్నారు. గత వారంలో మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతో సిఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. పవర్ ప్రజెంటేషన్‌లో అన్నారం, సుందిల్ల బ్యారేజీలు మేడిగడ్డ తరహాలో పగుల్లు ఏర్పడ్డాయని తేల్చారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులు అన్నారం బ్యారేజీలోని నిల్వ నీటిని శుక్రవారం నుండి ఖాళీ చేస్తున్నారు. అన్నారం బ్యారేజీలో 2.8 టిఎంసిల నిల్వ నీరు ఉండగా పది గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల చొప్పున దిగువకు తరలిస్తున్నారు. నిల్వ నీరు దిగువకు తరలి వెళుతుండటంతో శనివారం నాటికి బ్యారేజీలో ఇసుక దిబ్బలు బయట పడుతున్నాయి. నీటిని పూర్తిగా తొలగించిన తర్వాత బ్యారేజీ పియర్స్‌ను సాంకేతికంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ ‘అన్నారం’
RELATED ARTICLES