మెల్బోర్న్: ఈ ఏడాది తొలి గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఇటలీ యువ ఆటగాడు జానిక్ సిన్నర్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఈ 22 ఏళ్ల యువ ఆటగాడు, ప్రపంచ నాలుగో ర్యాంకర్ 3 3 6 6 6 తేడాతో రష్యాకు చెందిన డానిల్ మెద్వెదేవ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన కంటే ఒక ర్యాంక్ మెరుగ్గా ఉన్న మెద్వెదెవ్‌ను టైటిల్ పోరులో ఢీకొని, మొదటి రెండు సెట్లను కోల్పోవడంతో సిన్నర్ విజయం అసాధ్యమని అంతా అనుకున్నారు. కానీ, అత్యంత కీలకమైన మూడో సెట్‌లో అతను ఎదురుదాడికి దిగాడు. మెద్వెదెవ్ బలమైన సర్వీసులను, వాలీలను సమర్థంగా ఎదుర్కొంటూ, అద్భుతమైన ప్లేసింగ్స్‌తో రాణించాడు. వరుసగా మూడు సెట్లను గెల్చుకొని, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. మహిళల విభాగంలో బెలోరష్యాకు చెందిన అర్యానా సబలెంకా టైటిల్ అందుకున్న విషయం తెలిసిందే. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఆమె చైనా క్రీడాకారిణి జెంగ్ క్విన్‌వెయ్‌ని 6 6 ఆధిక్యంతో చిత్తుచేసింది. సబలెంకాకు క్విన్‌వెయ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. కాగా, భారత వెటరన్ ఆటగాడు, డబుల్స్ స్పెషలిస్టు రోహన్ బొపన్న పురుషుల డబుల్స్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మాథూ ఎడెన్‌తో అతను బరిలోకి దిగారు. వీరు ఫైనల్‌లో ఇటలీకి చెందిన సిమోన్ బొటెల్లీ, ఆండ్రియా వవసొసీ జోడీని 7 7 తేడాతో ఓడించి టైటిల్ అందుకున్నారు. మహిళల డబుల్స్ ఫైనల్‌లో హె సు వెయ్ (చైనీస్ తైపీ), ఎలిస్ మెర్టెన్స్ (బెల్జియం) 6 7 స్కోరుతో ల్యుమిలా కిమోగా (ఉక్రేన్), జెజెనా బస్టాపెన్కో (లాత్వియా) జోడీపై విజయం సాధించి, ట్రోఫీని స్వీకరించారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సిన్నర్
RELATED ARTICLES