సమకాలీనప్రపంచంలో ఏకత్వం’ నినాదంతో సాగుతున్న సువిశాల భారతంలో అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం, నిరుద్యోగం, అసమానతలు పలు సమస్యలు ఏడు దీనికి తోడుగా భారతదేశంలో లింగ వివక్ష, బాలికల/మహిళా హక్కుల ఉల్లంఘన, బాలికల్ని విద్య దూరం చేయడం, ఆడ బిడ్డల్లో పోషకాహారలో అమ్మాయిలకు ఆరోగ్య వసతుల లేమి లాంటి పలు సమస్యలు నేటికీ వెక్కిరిస్తూనే ఉన్నాయి. నేటి బాలికలే రేపటి అమ్మ, ఆలి, గృహిణి, బిడ్డ, సోదరిగా బహు పాత్రల్ని సమర్థవంతంగా తమ విధులను తూచా తప్పకుండా నిర్వహిస్తున్నప్పటికీ ఆమె అనారోగ్యాల పాలు అవుతూనే ఉన్నది. బాలికల సమస్యలను గుర్తించడంతో పాటు వాటిని పట్టుదలతో అధిగమించడానికి తీసుకోవలసిన చర్యలను చర్చించడం, కూతురిని కొడుకుతో సమానంగా పెంచడం లాంటి సామాజిక అంశాల్లో లోతైన అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా 24 జనవరి రోజున ‘జాతీయ బాలికల దినోత్సవం’ పా టించుట జరుగుతున్నది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ 2008 నుంచి హ క్కుల పరిరక్షణ పట్ల అవగాహన పెంచడం
లింగ వివక్ష
గర్భంలో ఆడ శిశువు ఉందని తెలిసి భ్రూణహత్యలకు పాల్పడడంతో మెుదలు అడుగడుగున లింగ వివక్షతో బాలికలను రెండవ శ్రేణి పౌరులుగా భా వించడం, లైంగిక వేధింపులు, మానభంగాలు, అ త్యాచార హత్యలు, వ్యక్తిగత ఆరోగ్యం పట్ల నిర్ల క్ష్యం, పాఠశాల/ఉన్నత విద్యకు దూరం చేయడం, పోషకాహారలోప అనారోగ్యాలు లాంటి సమస్యల వరకు భారత బాలికలు అభాగ్య పౌరులుగా నేటికీ వివక్షకు గురి కావడం జాతికే అవమానకరం. భా రత ప్రభుత్వం బాలికల వికాసానికి తీసుకుంటు న్న పలు చర్యలు ఆశించిన ఫలితాల్ని ఇవ్వడం లే దు. బాలికల వికాసానికి ప్రథమ అడుగులు ఇంటి నుండే ప్రారంభం కావాలి. అమ్మానాన్నలు కోడుకుతో సమానంగా కూతుర్లను పెంచి పోషించి వి ద్యాబుద్దులు నేర్పించాలి. 2015లో భ్రూణ హత్య ల కారణంగా 6 ఏండ్ల లోపు బాలల లింగ నిష్పత్తి 1000 : 900 (బాలురు : బాలికలు) మరియు 2011లో 1000 : 918 మాత్రమే ఉండడం దేశానికి శాపంగా మారనుంది. 2008లో కొన్ని ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ లింగ నిష్పత్తి 1000 : 800 వరకు పడి పోవడం దేశ దౌర్భాగ్యం. మహిళా వివక్షకు నిదర్శనంగా లింగ నిష్పత్తి పడిపోవడం జరిగితే దేశ సుస్థిరాభివృద్ధి కుంటుపడుతుందని గమనించాలి. లింగ నిష్పత్తి పడిపోకుండా లింగ నిర్థారణ పరీక్షల నిషేధం, చట్టవ్యతిరేక అబార్షన్లను కట్టడి చేయడం, ఆడ శిశువు జననాంతర జాగ్రత్తలు, గర్భిణికి పోషకాహార కల్పన లాంటి చర్యలు విధిగా తీసుకోవాలి.
సంక్షోభంలో భారత కూతుర్లు
బాలికలకు పాఠశాల విద్యతో పాటు ఉన్నత విద్య అందుబాటులోకి తేవాలి. నేటికీ పురుషుల అక్షరాస్యతా రేటు 82 శాతం ఉండగా, మహిళలకు 64 శాతం మాత్రమే ఉన్నది. మహిళా సాధికారతకు, మహిళా విద్యకు ప్రత్యక్ష సంబంధం ఉం టుంది. మహిళా విద్యతో వారిలో ఆత్మవిశ్వాసం, సంపాదన, గృహ నిర్ణయాల్లో భాగస్వామ్యం, పిల్ల ల విద్యాభ్యాసం, గృహ ఆరోగ్య పరిరక్షణ లాంటి సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. గ్రామీణ బాలిక ల్లో పోషకాహారలోపం, రక్తహీనత, విటమిన్ లోపా లు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. బాల్యవివాహ వ్యవస్థ నేటికీ జడలు విప్పుతూనే ఉంది. ప్ర పంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు బాలికల్లో ఒక భారతీయ బాలిక బాల్యవివాహ ఉచ్చులో పడుతోందనే కఠిన వాస్తవాన్ని యూనిసెఫ్ ప్రకటించిం ది. బాలికలు/యువతులపై అత్యాచారాలు, లైంగి క హింసలు, ఆసిడ్ దాడులు, భ్రూణ హత్యలు, బలవంతపు వ్యభిచార వృత్తులు, గృహ హింస, వరకట్న వేధింపులు, బాలికల అక్రమ రవాణ, పని ప్ర దేశాల్లో వేధింపులు, ఆడ శిశువును భారంగా భా వించడం లాంటి అనేక సమస్యలు గత 10 సంవత్సరాలుగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ అ న్ని విద్యాలయాల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్ వసతులు కల్పించకపోవడం అత్యంత బాధాకరం.
బాలికల సమస్యలకు పరిష్కారాలేమిటి !
బాలికలకు వైద్య సదుపాయాలు, హక్కుల పరిరక్షణ, గౌరవంతో కూడిన రక్షణలు, ఆర్థిక స్వేచ్ఛ, సాంకేతిక విద్య, మాతాశిశు ఆరోగ్య కేంద్రాలు, వ్యక్తిగత పరిశుభ్రత పట్ట అవగాహనలు కలిగించ డం మన కనీస కర్తవ్యంగా భావించాలి. ప్రభుత్వా లు కల్పిస్తున్న ‘సేవ్ గర్ల్ చైల్డ్, ‘సుకన్య సమృద్ధి యోజన’, ‘బాలికా సమృద్ధి యోజన’, ‘బేటీ పడా వో బేటీ బచావో’, ‘కళ్యాణ లక్ష్మి’, ‘సిబియస్‌ఈ ఉడాన్’, ‘నేషనల్ స్కీమ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’, ‘విద్యలో మహిళలకు రిజర్వేషన్ల’ కల్పన లాంటి పథకాల పట్ల అవగాహన కల్పించాలి. ఆడ బిడ్డ పుట్టుకను మహాలక్ష్మి జననంగా భావించాలి. అమ్మాయిలో రేపటి అమ్మను దర్శించాలి. ఆడది అబల కాదని, అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్న ఆదిశక్తి సబల రూపంగా విశ్వసించాలి. అమ్మాయి లేని ఇల్లు న వ్వుల దీపం లేని చిక్క చీక టి కమ్మిన గృహంతో సమానమని నమ్ముదాం. అమ్మాయిల ను ఆదరిద్దాం, ఆరాదిద్దాం. అమ్మ లేక జననం లేదు, అమ్మ ప్రేమ కు ప్ర లేదు. అమ్మాయిలో చదువుల సరస్వతి, సంపదల లక్ష్మి, ధైర్య దుర్గలను దర్శిస్తూ వారి ఉన్నతికి ఊతం అవుదాం.
శాశ్వత
ప్రపంచ మానవాళి పలు సమస్యల వలయంలో చిక్కి సతమతం అవుతున్నారు. ఆకలి కేకలు, అసమానతల అవలక్షణాలు, వాతావరణ ప్రతికూల మార్పులు, జనాభా విస్పొటనాలు, నిరుద్యోగ నీరసాలు, ప్రజారోగ్య సమస్యలు, పేదరిక వికారాలు, అవిద్య, వివక్షలు, ప్రాంతీయ విభేధాల విద్వేషాలు, పలు దేశాల మధ్య పోరాటాలు, డిజిటల్ వేదికల దుర్వినియోగాలు లాంటి అనేక సమస్యలు మానవాళి చుట్టు ముళ్ల కంచెలుగా నిత్య వెంటాడుతున్నాయి. శారీరక ఆరోగ్యానికి పోషకాహారం, మానసిక వికాసానికి సువిద్య మాత్రమే ఉపకరిస్తుందని గమనించాలి. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగే ఏకైక దివ్య ఔషధం ‘నైపుణ్యంతో కూడిన విద్య’ మాత్రమే. విద్యావేత్తలు అభిప్రాయం. విద్య ఒక ప్రాథమిక హక్కు అని, ఇన్నొవేషన్‌కు వేదికని, ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చే ఐక్య వేదికని, జనవరి సమస్యలకు ఉత్తమ పరిష్కార మార్గమని అంతర్జాత విద్యా దినోత్సవం ఏట యునెస్కో చొరవతో అంతర్జాతీయ విద్యా దినం ఘనంగా నిర్వహించడం ముదావహం, అభినందనీయం. డిజిటల్ యుగంలో ప్రపంచవ్యాప్తం 258 మిలియన్ల పిల్లలు/యువత బడికి దూరం కావడం, 763 మిలియన్ల వయోజనులు నిరక్షరాస్యులుగా బతుకులు ఈడ్చడం, ఆఫ్రికాలో 40 శాతం మహిళలు/బాలికలు ప్రాథమిక విద్య దిశలోనే ఆ గిపోవడం, మిలియన్ల శరణార్థి శిబిరాల్లోని పిల్లలు బడికి దూరంగా ఉండ లాంటి వాస్తవాలు అత్యంత బాధాకరం. అంతర్జాతీయ విద్యా దినోత్సవం – ఈ శాంతి కోసం విద్య సమపార్జన ఈ గుర్తించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అధిగమించడానికి అందరికీ విద్య అనే అక్షరాయుధాన్ని సంధించాలని పౌర సమాజం తెలుసుకోవాలి. విద్య సమపార్జనకు సరైన ఉపాద్యాయులను ఎంచుకొని వారు నిర్ధేశించిన మార్గంలో విజ్ఞానవేత్తలుగా దేశాభివృద్ధి యజ్ఞంలో పాల్గొనాలి.
డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037
మన స్వేచ్ఛ ఎప్పుడు?
RELATED ARTICLES