HomeNewsTelanganaఫిబ్రవరిలోనే మెగా డిఎస్‌సి

ఫిబ్రవరిలోనే మెగా డిఎస్‌సి

యుపిఎస్‌సి తరహాలో టిఎస్‌పిఎస్‌సిలో పరీక్షల అమలు
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెల్లడి
ప్రజాపక్షం/నల్లగొండ ప్రతినిధి  తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కల సాకారం చేసేందుకు ఫిబ్రవరి నెలలోనే మెగా డిఎస్సీ నిర్వహిస్తామని, యుపిఎస్‌సి తరహా విధానాలనే టిఎస్‌ పిఎస్‌సి గ్రూప్‌ పరీక్షలన్నింటిలో తూచ తప్పకుండా ఆచరిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని శివాజీనగర్‌ నుంచి పానగల్‌ రోడ్డు వరకు రూ.90 లక్షల వ్యయంతో ఎన్‌సిఏపి నిధులతో సిసి రోడ్లు, ఎన్జీ కళాశాల నుంచి రామగిరి వరకు 30 లక్షలతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, ఆర్డీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీతో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.23 కోట్ల 75 లక్షల వ్యయంతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ భవనంకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తామని నోటిఫికేషన్‌ వేసి పేపర్‌ లీకేజీలు చేశారని తమ ప్రభుత్వం అలా జరగకుండా పకడ్భందీగానే ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. నిరుద్యోగులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వం ద్వారానే ఉచితంగా శిక్షణ నిర్వహిస్తామని తెలియజేశారు. పాత ప్రభుత్వంలో ఎమ్మెల్యేల చుట్టు తిరిగినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తిరగాల్సిన అవసరం లేదని, అర్హులైన లబ్దిదారులందరికి నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ పథకంలో లబ్దిదారులకు ఆర్ధిక సహాయంతో తులం బంగారంపై క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి, ఎస్‌పి చందనా దీప్తి, అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, మున్సిపల్‌ ఇంచార్జీ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌ గౌడ్‌, మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కమీషనర్‌ కందుకూరి వెంకటేశ్వర్లు, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ సత్యనారాయణ, ఆర్డీవో రవి, తహశీల్దార్‌ శ్రీనివాస్‌, తదితరులున్నారు.
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ లబ్దిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం అందజేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ ఆర్డివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కుల పంపినీ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడిడ ముఖ్య అతిధిగా పాల్గొని నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నల్లగొండ, కనగల్‌, తిప్పర్తి మండలాలకు చెందిన 244 మందికి ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కులను మొత్తం 2 కోట్ల 44 లక్షల 28 వేల 304 రూపాయలకు సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్‌ చెక్కులతో పాటు తులం బంగారం అందజేసే కార్యక్రమానికి రాబోయే రాష్ట్ర కెబినెట్‌ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాక కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రితో కలిసి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) జె.శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమీషనర్‌ కందుకూరి వెంకటేశ్వర్లు, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ సత్యనారాయణ, ఆర్‌డిఓ రవి, ఎంఆర్‌ఓ శ్రీనివాస్‌, ఇంచార్జీ మున్సిపల్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, మున్సిపల్‌ ప్లోర్‌ లీడర్‌ బుర్రి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments