HomeNewsBreaking Newsసిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు

సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు

హుటాహుటిన హైదరాబాద్‌ ఎఐజి ఆసుపత్రికి తరలింపు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఖమ్మంలో తన నివాసంలో ఉన్న సమయంలో ఆయనకు ఛాతి లో నొప్పి వచ్చింది. దీంతో ఆయనను సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తమ్మినేనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం తమ్మినేనిని హైదరాబాద్‌లోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. ఆయ న ఆరోగ్య పరిస్థితిపై ఎఐజి ఆసుపత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తమ్మినేని వీరభద్రం వెంటిలేటర్‌పై ఉన్నడని వైద్యు లు తెలిపారు. గుండె కొట్టుకోవడంలో అసాధారణ ఉందని, దానితో పాటు మూత్రపిండాల పనిచేయకపోవడంతో ఊపిరితిత్తులలో నీరు చేరడంతో ఇనాసిస్‌ వెంటిటేషన్‌ అవసరమైందన్నారు. రక్త పోటును మెరుగుపర్చేందుకు మందులతో చికిత్స అందిస్తున్నామని, ఊపిరితిత్తుల నుండి నీరు తొలగింపు, గుండె కొట్టుకునే చికిత్సలను అందిస్తున్నమన్నారు. క్రిటికల్‌ కేర్‌ నిపుణులు, కార్డియాలజిస్టులు, ఎలక్ట్రోఫిజియాలజిస్టులు, నెప్రాలజిస్టులు, పల్మోనాలజిస్టులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం డాక్టర్‌ సోమరాజు, డాక్టర్‌ డి.ఎస్‌.కుమార్‌ నేతృత్వంలో చికిత్సను అందిస్తున్నట్లు బెలిటెన్‌లో వివరించారు. అయితే ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు బులిటెన్‌లో ప్రకటించారు. తమ్మినేని రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో వరుసగా పర్యటనలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. పార్టీ కార్యకర్తలు ఆసుపత్రికి రావద్దని వైద్యులు సూచించారు.
ఏఐజి ఆసుపత్రిలో తమ్మినేని కుటుంబ సభ్యులకు సిపిఐ(ఎం) నేతల పరమర్శ
ఆసుపత్రిలో తమ్మినేని ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్‌తో సంప్రదించి, తగిన వైద్యం అందించడానికి పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, డి.జి.నరసింహరావు, పి.ప్రభాకర్‌ సమన్యయం చేస్తున్నారు. తమ్మినేని కుటుంబ సభ్యులను కలిసి, వారిలో సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, జి.నాగయ్య, చుక్క రాములు, టి.సాగర్‌, పాలడుగు భాస్కర్‌, డి.జి.నరసింహారావు, జాన్‌ వేస్లీ, ఎం.డి. అబ్బాస్‌, ప్రభాకర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్‌, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments