HomeNewsBreaking Newsరామమందిర ప్రాణప్రతిష్టకు రాజకీయరంగు

రామమందిర ప్రాణప్రతిష్టకు రాజకీయరంగు

‘నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి కార్యక్రమం’గా మార్చారు
భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో రాహుల్‌
చీఫోబోజా : అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ‘ఎన్నికల ఫ్లేవర్‌’తో ‘నరేంద్ర మోడీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమం’గా మార్చారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. తమ పార్టీ నేతలు రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించడాన్ని రాహుల్‌ గట్టిగా సమర్థించారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో భాగంగా మంగళవారం రాహుల్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనెల 22న అయోధ్యలో జరిగే కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ పూర్తిగా రాజకీయ రంగు పులిమి
నరేంద్రమోడీ కార్యక్రమంగా మార్చారని ఆరోపించారు. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమంగా తయారైందని రాహుల్‌ దుయ్యాబట్టారు. అందువల్లే తమ పార్టీ అధ్యక్షుడు రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లలేకపోతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ‘తామ అన్ని మతాలను, ఆచారాలను గౌరవిస్తామని, హిందూ మత పెద్దలు, హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు కూడా జనవరి 22 రామ మందిర వేడుకలకు వెళ్లడంపై ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పారు. ఇది రాజకీయ కార్యక్రమం అని‘ రాహుల్‌ గాంధీ అన్నారు. దీంతోనే ప్రధాని నరేంద్రమోడీ చుట్టూ రూపొందించిన ఈ రాజకీయ కార్యక్రమానికి వెళ్లడం మాకు ఇష్టం లేదు అని అన్నారు. ప్రతిపక్ష భారత కూటమిపై రాహుల్‌ స్పందిస్తూ కూటమి బలంగా ఉందని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని కూటమి కచ్చితంగా ఓడిస్తుందని రాహుల్‌ ఉద్ఘాటించారు. “ఇండియా’ ఏర్పాటులో నాయకుల మధ్య పరస్పర గౌరవం, ఆప్యాయత ఉంది. ‘ఇండియా’ ఏర్పాటు ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఆలోచనలకు వ్యతిరేకంగా ఏర్పడిన సైద్ధాంతిక నిర్మాణం. కూటమిలో వచ్చిన చిన్న చిన్న సమస్యలు సమసిపోతాయని నాకు విశ్వాసం ఉంది. మేము కలిసి పోరాడుతాం. బిజెపి ఓడిస్తాం’ అని గాంధీ చెప్పారు. తృణమూల్‌ కాంగ్రెస్‌తో పొత్తు స్థితిపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, మరోవైపు భారత కూటమిలో పరిస్థితులు చాలా బాగున్నాయని.. చర్చలు సజావుగా సాగుతున్నాయని రాహుల్‌ గాంధీ తెలిపారు. త్వరలోనే సీట్ల పంపకం తదితర పనులు పూర్తి చేస్తామన్నారు. ఏప్రిల్‌- జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధిస్తుందని గాంధీ చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి బిజెపిని దీటుగా ఎదుర్కొంటుందని తాను భావిస్తున్నానన్నారు. సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయానికి సంబంధించిన అంశాలను లేవనెత్తడమే ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ లక్ష్యమని రాహుల్‌ గాంధీ తెలిపారు. బిజెపి విభజనవాదానికి భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రత్యామ్నాయమని రాహుల్‌ తెలిపారు. ప్రధాని మోడీ ప్రజలకు వాగ్దానాలు చేస్తారే కానీ, వాటిని నెరవేర్చరని ఎద్దేవా చేశారు. కాగా.. తాము మణిపూర్‌ నుండి యాత్ర ప్రారంభించడానికి గల కారణం.. ఇంతకుముందు ఇక్కడ విషాదం జరిగింది. ప్రధాని మణిపూర్‌కు రావడం తగదని, ఇది సిగ్గుచేటని దుయ్యబట్టారు. మరోవైపు.. నాగాలాండ్‌కు ఇచ్చిన హామీని ప్రధాని నెరవేర్చలేదని మండిపడ్డారు. నాగాలా్‌ండ సమస్యను పరిష్కరించడానికి ప్రజల మాటలు వినడం, కమ్యూనికేట్‌ చేయడం అవసరమని, కానీ ప్రధాని అలా చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే.. లోక్‌సభ ఎన్నికలకు ముందు చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర.. 67 రోజుల్లో 15 రాష్ట్రాలు, 110 జిల్లాల మీదుగా సాగనుంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments