HomeNewsBreaking Newsభారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర నేటి నుంచే

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర నేటి నుంచే

67 రోజులు, 100 లోక్‌సభ నియోజకవర్గాల్లో యాత్ర
ఇంఫాల్‌ : హింసాత్మకంగా మారిన మణిపూర్‌ నుంచి ఈనెల 14వ తేదీన పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో చేపట్టే ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ను కాంగ్రెస్‌ ప్రారంభించనుంది. ఈ యాత్ర 15 రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాల గుండా సాగనుంది. రాహుల్‌ గతంలో చేసిన భారత్‌ జోడో యాత్ర కంటే ఇప్పుడు చేపడుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర మరింత పరివర్తినగా ఉంటుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. పార్లమెంటులో ప్రజల సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వనందున భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రను చేపడుతున్నట్లు కాంగ్రెస్‌ తెలిపింది. అదే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వ సూత్రాలను పునరుద్ధరింపజేయడానికి చొరవ చూపడమే లక్ష్యమని పేర్కొంది. ఇదిలా ఉండగా, మోడీ సర్కార్‌పై పరోంగా రాహుల్‌గాంధీ మండిపడ్డారు. భావోద్వేగ సమస్యలను రాజకీయంగా దుర్వినియోగం
చేస్తున్నారని, వాస్తవ సమస్యల నుంచి దృష్టి మరల్చి దేశ ప్రజలకు ద్రోహం చేస్తున్నారన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే యాత్ర వేదికను ఇంఫాల్‌కు బదులుగా మణిపూర్‌లోని తౌబాల్‌ జిల్లాలో ఓ ప్రైవేట్‌ మైదానం నుండి ప్రారంభించనున్నారు. మణిపూర్‌లోని ప్యాలస్‌ గ్రౌండ్స్‌ నుంచి యాత్ర ప్రారంభించేందుకు కాంగ్రెస్‌ షరతులతో కూడిన అనుమతులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో వేదికను మార్చుకుంది. గత ఏడాది మే నుంచి మణిపూర్‌ జాతి హింసతో అట్టుడుకుతోంది. దాదాపు 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేతలందరూ తౌబాల్‌లో జెండా ఊపి యాత్రను ప్రారంభించనున్నారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర బస్సుల్లోనే కాకుండా కాలినడకన కూడా 6,713 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. యాత్ర 67 రోజుల్లో 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్‌లను కవర్‌ చేస్తుంది, అనంతరం మార్చి 20 లేదా 21 న ముంబయిలో ముగుస్తుంది. గత 10 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్‌ పేర్కొంది. ‘సాహో మత్‌, దారో మత్‌ (బాధపడకండి, భయపడకండి)’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘న్యాయ్‌” గీతాన్ని విడుదల చేసింది. కాంగ్రెస్‌ తన మార్గంలో ఎక్కడైనా యాత్రలో చేరాలని ఇండియన్‌ నేషనల్‌ ఇన్‌క్లూజివ్‌ డెవలప్‌మెంటల్‌ అలయన్స్‌ (ఇండియా) కూటమి నాయకులందరినీ కూడా ఆహ్వానించింది. యాత్ర ఉత్తరప్రదేశ్‌లో 11 రోజుల్లో 1,074 కి.మీ. సాగనుంది. గాంధీ కుటుంబ కంచుకోట అయిన ఆమేథీ, రాయ్‌బరేలీ, ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసితో సహా రాజకీయంగా కీలకమైన ప్రాంతాల గుండా వెళుతుంది. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర అంతకుముందు 4,000 కిలోమీటర్ల భారత్‌ జోడో యాత్ర వలె ప్రభావవంతంగా రూపాంతరం చెందుతుందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ జోడో యాత్రలో, పెరుగుతున్న అసమానతలు, పెరుగుతున్న సామాజిక ధ్రువణత, పెరుగుతున్న రాజకీయ దౌర్జన్యం, నిరంకుశత్వం అనే మూడు పెద్ద సమస్యలను గాంధీ లేవనెత్తారని, దీని నుండి బయటపడటానికి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని రమేష్‌ అన్నారు. ఇక భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర మణిపూర్‌లో ఒక రోజు సాగుతుందని, నాగాలాండ్‌లోకి ప్రవేశించి రెండు రోజుల్లో 257 కి.మీ మేర ఐదు జిల్లాలను కవర్‌ చేస్తుందని వెల్లడించారు.

ప్రజాపక్షం/హైదరాబాద్‌: అఖిల భారత కాంగ్రెస్‌, భారత్‌ జోడో అభియాన్‌ సంయుక్త సమావేశం న్యూఢిల్లీలో గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో ఎఐసిసి అగ్రనేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సివేణు గోపాల్‌, భారత్‌ జూడో అభియాన్‌ 40 మంది ప్రతినిధులు యోగేంద్ర యాదవ్‌, మాజీ ఎం ఎల్‌ ఏ పంకజ్‌ పుష్కర్‌, నేషనల్‌ ఒబిసి హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ, ఎఐఒంబిసిఎ అధ్యక్షుడు గౌడ కిరణ్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు. భారతదేశంలో వివిధ మతాలు కులాలుగా, ప్రాంతాలుగా విడిపోయిన భారతీయులను ఒకే తాటిపై తీసుకొచ్చి, అన్యాయానికి గురైన ఎస్‌సి,ఎస్‌టి,బిసి, మైనార్టీ వర్గాల తో పాటు గౌరవంగా బతకాలని, అందరికీ న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ యాత్రను ప్రారంభించామని రాహుల్‌ గాంధీ తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments