గమ్యం చేరిన ఆదిత్య ఎల్-1
బెంగళూరు : సూర్యనక్షత్రం అధ్యయనానికి ఇస్రో ప్రయోగించిన ప్రతిష్టాత్మకమైన అంతరిక్ష నౌక ఆదిత్య ఎల్ దాదాపు 15 లక్షల కి.మీ.లు ప్రయాణించి నిర్దేశిత లక్ష్య కేంద్రానికి చేరుకుంది. దీంతో ఇస్రో మరోసారి చరిత్రాత్మకమైన ఘన విజయం సాధించింది. భూ మికి సూర్యుడికి మధ్యఒక నిర్దేశిత శూన్యస్థానాన్ని కేంద్రంగా చేసుకుని స్థిరంగా అక్కడే ఉండి ఐదేళ్ళపాటు అధ్యయ నం చేసేందుకు ఆదిత్య 1 నౌకను ఇస్రో ప్రయోగించింది. ఆదిత్య నౌక గమ్యం చేరడంతో భారతదేశం ప్రయోగించిన మొట్టమొడటి సోలార్ అబ్వర్వేటరీగా ఈ నౌక చరిత్రలో స్థానం సంపాదించుకుంది. ఇస్రో సాధించిన తాజా విజయంపై ప్రధామంత్రి నరేంద్రమోడీ స్పందిస్తూ.. చంద్రయాన్ విజయం సాధించిన కొన్ని నెలల తర్వాత ఇస్రో మరోసారి ఎంతో సున్నితంగా అత్యంత సవాళ్ళతో కూడిన గొప్ప విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. భూమికి సూర్యుడికీ మధ్య ఉన్న దూరంలో ఆదిత్య నౌక కేవలం ఒకశాతం దూరం మాత్రమే ప్రయాణించి ఎల్ అనే ఇస్రో నిర్దేశిత శూన్యప్రదేశంలోని స్థిరమైన కేంద్రానికి చేరుకుంది. ఈ కేంద్రంలో ఉండటంవల్ల ఆదిత్య నౌక ఎంతో సౌలభ్యంగా సూర్యుడిలో వస్తున్న మారులను నిరంతరం పరిశీలించి ఆ చిత్రాలను, మార్పులను భూ కేంద్రానికి పంపగలుగుతుంది. “భారతదేశం మరో మైలురాయిని సృష్టించింది, ఆదిత్య నౌక లక్ష్యం చేరుకుంది, మన శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషికి ఇది తార్కాణం, అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష సాహసాన్ని సాధించారు” అని ప్రధామంత్రి పేర్కొన్నారు. “దేశ ప్రజలతో కలిసి నేను కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రశంసలు ఇస్తున్నాను, ఇది ఒక అసాధారణమైన సాహసవిజయం, విజ్ఞానశాస్త్రంలో మనం ఇంకా విజయాలను కొనసాగిదాం, మానవాళి ప్రయోజనాలకు కృషి చేద్దాం” అని ఎక్స్ వేదికపై ప్రధానమంత్రి పేర్కొన్నారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కూడా ఒక ప్రకన చేస్తూ మూన్ వాక్ నుండి సన్ డ్యాన్స్ వరకూ భారతదేశం ఏడాదికాలంలో గొప్ప విజయాలు సాధించిందన్నారు. ప్రధామంత్రి నరేంద్రమోడీ మార్గదర్శకత్వంలో ఇస్రో ఘన విజయం సాధించిందన్నారు. 2023 సెప్టెంబరు 2వ తేదీన శ్రీహరికోటలోని సతీశ్ థావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఆదిత్య 1 ను ఇస్రో ప్రయోగించింది. 63.20 నిమిషాలు విజయవంతంగా ప్రయాణించాక భూమిచుట్టూ పరిభ్రమించే ప్రక్రియను ప్రారంభించి ఆదిత్య కొత్త మార్గంలో సూర్యుడిదిశగా ప్రయాణం ప్రారంభించింది. ఏడు పేలోడ్స్‌ను ఆదిత్య తన వెంట తీసుకువెళ్ళింది. భూ కేంద్రంతో అనుసంధానం తెంచుకున్న తర్వాత ఆదిత్య తనంతట తానుగా వివిధ దశల్లో ఎత్తు పెంచుకుంటూ వెళ్ళింది. ఆదిత్య ఎల్ 1 లోని పేలోడ్లు ద్వారా అత్యంత కీలకమైన సూర్యుడికి చెందిన సమాచారం మానవాళికి లభ్యం కాగలదని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు.
సూర్యుడి ఉపరితలంపై ఉన్న క్రోమోస్పియర్ లేదా కరోనాను అధ్యయనం చేయడం, కరోనా వేడిని, దాని తీవ్రతను అధ్యయంన చేయడం, సూర్యుడి ఉపరితలంపై ఉన్న ప్లాస్మా అధ్యయనం, ఆ నక్షత్రంలో జరుగుతున్న పేలుళ్ళును అంచనా వేయడం, ఉష్ణోగ్ర, వేగం తీవ్రత అంచనా, బహుముఖ వలయాల అంచనా, సూర్యుడ చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్ర అధ్యయనం, అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావం, భూమిపై సూర్యుడి ప్రభావం, రాబోయే విపత్తులు వంటి అంశాలను ఆదిత్య ఎల్1 అధ్యయంన చేస్తుంది.
ఇస్రో చరిత్రాత్మక ఘన విజయం
RELATED ARTICLES