HomeNewsBreaking Newsనూతనంగా ఏర్పడిన ప్రభుత్వంపై.. బిఆర్‌ఎస్‌ శాపనార్థాలు తగవు

నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంపై.. బిఆర్‌ఎస్‌ శాపనార్థాలు తగవు

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీల అమలుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో జీర్ణించుకోలేని బిఆర్‌ఎస్‌ నాయకులు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నెలరోజులు కూడా పూర్తికాకుండానే బిఆర్‌ఎస్‌ నాయకుల వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అన్నారు. కాంగ్రెస్‌ 420 అని శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. బిజెపి నాయకులు కాళేశ్వరంపైన సిబిఐ విచారణ చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారని, దానికి బిఆర్‌ఎస్‌ నాయకులు కూడా వంత పడుతున్నారన్నారు. అసలు సిబిఐ కేంద్ర ప్రభుత్వ కీలుబొమ్మ అని అన్నారు. కాళేశ్వరం కుంగిపోవడం, మేడిగడ్డ వద్ద గుంతలు పడటం, సుందిళ్ల ప్రాజెక్టులపై రాష్ట్రం ప్రభుత్వం, న్యాయ విచారణ చేపట్టడం శుభపరిణామం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడుతుందని, ఈ ప్రజా పాలనలో కోటి వరకు దరఖాస్తులు వస్తున్నాయని చెపాప్రు. దుబారా ఖర్చులు పెట్టకుండా, ప్రజా సమస్యల పరిష్కరిస్తూ ప్రజాపాలన కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల మెప్పు పొందేవిధంగా ఉద్యోగ నియమాకాలు చేపట్టాలని, విద్యార్థి, యువత, నిరుద్యోగ యువకులు మేధావులు, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగాలన్నారు. తక్షణమే పక్కా ఇళ్ల సమస్యలను పరిష్కరించి, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను గుర్తించాలని చాడ వెంకట్‌ రెడ్డి కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments