పుణె: వన్డే ప్రపంచకప్ 2023లో అఫ్గానిస్థాన్ సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన అఫ్గానిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మెగా టోర్నీలో అఫ్గాన్‌కు ఇది మూడో విజయం కాగా.. పాయింట్స్ టేబుల్లో ఆ జట్టు ఐదో స్థానానికి ఎగబాకింది. గెలుపుతో అఫ్గాన్ సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. చివరి మూ డు మ్యాచ్‌ల్లో ఆ జట్టు విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ ఖాయం కానుంది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ పాతుమ్ ని స్సంక(46), కుశాల్ మెండీస్(39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ (4/34), ముజీబ్ ఉర్ రెహ్మాన్(2/38) శ్రీలంక పతనాన్ని శాసించగా.. అజ్మతుల్లా ఓమర్జాయ్, రషీద్ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 45.2 ఓవర్లలో 3 వికెట్లకు 242 పరుగులు చేసి సునాయ విజయాన్ని అందుకుంది. రెహ్మత్ షా(74 బంతుల్లో 7 ఫోర్లతో 62), హష్ముతుల్లా షాహిది(74 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్), ఒమర్జాయ్(63 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక(2/48) రెండు వికెట్లు తీయ గా.. కాసున్ రజితా(1/48) ఓ వికెట్ పడగొట్టా డు. పరుగుల లక్ష్యచేధనకు దిగిన అఫ్గాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్(0) తీవ్రంగా నిరాశపరిచాడు. మధుషంక వేసిన తొలి ఓవర్లోనే గుర్బాజ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో పరుగుల ఖాతా తెరవకుండానే అఫ్గాన్ వికెట్ కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఇబ్రహీం జడ్రాన్(39), రెహ్మత్ షా(62) జట్టును ఆదుకున్నారు.రెండో వికెట్‌కు 73 పరుగుల జో డించిన అనంతరం జడ్రాన్‌ను మధుషంక ఔట్ చేశాడు. దాంతో క్రీజులోకి వచ్చిన హష్మతుల్లాతో రెహ్మాత్ షా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో అతను 61 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిలకడగా ఆడుతున్న అతన్ని కాసున్ రజితా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూ డో వికెట్‌కు నమోదైన 58 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.క్రీజులోకి వచ్చిన ఒమర్జాయ్ ధా టిగా ఆడాడు. షాహిది ఆచితూచి ఆడినా.. ఒమర్జాయ్ శ్రీలంక బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఈ క్రమంలో 67 బంతుల్లో హష్మతుల్లా, 50 బం తుల్లో ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నా రు. అర్థ శతకం అనంతరం ఒమర్జాయ్ ధాటిగా ఆడి అఫ్గాన్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు
శ్రీలంకపై అఫ్గానిస్థాన్ఘన విజయం!
RELATED ARTICLES