HomeNewsBreaking Newsహాస్టల్‌ ఆహారంలో కప్ప

హాస్టల్‌ ఆహారంలో కప్ప

భువనేశ్వర్‌ : హాస్టల్‌ ఇచ్చే ఆహారంలో చచ్చిన కప్ప కనిపించింది. ఇది చూసి విద్యార్థులు షాక్‌ అయ్యారు. ఆ విద్యా సంస్థ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది. కళింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీలోని హాస్టల్‌ ఆహారంలో చచ్చిన కప్పను విద్యార్థి ఆర్యన్ష్‌ గుర్తించాడు. దీని గురించి ఎక్స్‌లో ఆందోళన వ్యక్తం చేశాడు. ‘ఇది కిట్‌ భువనేశ్వర్‌. భారతదేశంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 42వ ర్యాంక్‌లో ఉంది. తమ బిడ్డ ఇంజినీరింగ్‌ డిగ్రీ పొందేందుకు తల్లిదండ్రులు సుమారు 17.5 లక్షలు చెల్లిస్తారు. ఇదీ కళాశాల హాస్టల్‌లో అందిస్తున్న ఆహారం. మెరుగైన విద్య, సౌకర్యాల కోసం విద్యార్థులు భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎందుకు వెళ్తున్నారో అని మేం ఆశ్చర్యపోతున్నాం’ అని అందులో పేర్కొన్నాడు. అలాగే ఆహారంలో వచ్చిన చచ్చిన కప్ప ఫొటో కూడా పోస్ట్‌ చేశాడు. కాగా, ఈ సంఘటనపై ఆ విద్యా సంస్థ స్పందించింది. మెస్‌ ప్రొవైడర్‌కు ఒక రోజు చెల్లింపును తగ్గించడంతో పాటు ఘాటుగా హెచ్చరించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఒక నోటీస్‌ విడుదల చేసింది. అయితే విద్యార్థి ఆర్యన్ష్‌ దీనిపై మరోసారి ఎక్స్‌లో స్పందించాడు. ‘మనిషి జీవితం విలువ ఇది. భువనేశ్వర్‌ యూనివర్సిటీ హాస్టల్‌ ఫుడ్‌లో కప్ప కనిపించినందుకు డ్యామేజ్‌ కంట్రోల్‌కు ప్రయత్నించారు. మెస్‌ ప్రొవైడర్‌ కంపెనీకి ఒక రోజు చెల్లింపు మినహాయించాలని నిర్ణయించారు.. వావ్‌’ అంటూ విమర్శించాడు. ఈ పోస్ట్‌ వైరల్‌ కావడంతో నెటిజన్లు స్పందించారు. కాలేజీ హాస్టల్‌లో తాము ఎదుర్కొన్న ఇలాంటి పలు సంఘటనలను కొందరు ప్రస్తావించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments