మండలి శాశ్వత సభ్యదేశాల సంఖ్య పెరగాలి : నరేంద్రమోడీ
జి బాధ్యతలు బ్రెజిల్‌కు స్వాధీనం
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో, ఇతర బహుళ ప్రయోజనకరమైన అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు జరగాల్సిందేనని ప్రధానమంత్రి నరేద్రమోడీ అన్నారు. రెండురోజులు ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన జి 18వ శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. రెండోరోజు సమాశంలో నరేంద్రమోడీ జి బాధ్యతలను బ్రెజిల్ దేశాధ్యక్షుడు లూయీ ఇనాసియో డసిల్వాకు స్వాధీనం చేశారు. భద్రతా మండలిని విస్తరించవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచంలో ఆవిష్కృతమవుతున్న కొత్త వాస్తవాలకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యంగల బహుళ ప్రయోజకరమైన సంస్థలను కొత్త అవసరాలకు అనుగుణంగా సంస్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా ఆహార సమస్య, ఉవ్రాదంతోపాటు సైబర్ సెక్యూరిటీ,క్రిప్టో కరెన్సీ కూడా ప్రపంచానికి సమస్యగా మారిందని, దీని పరిష్కారానికి కూడా మార్గాలు అన్వేషించాలని అన్నారు. సైబర్ మార్గం ఇప్పుడు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి ఒక కొత్త వనరుగా ఉపయోగపడుతోందని అన్నారు. నేపథ్యంలో ప్రతిదేశ భద్రత విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకే ప్రపంచం, ఒకే భవిత, ఒకకే కుటుంబం భావనను ముందుకు తీసుకువెళ్ళాలన్నారు. ప్రపంచ కుగ్రామ భానకు మించచినస్థాయిలో ప్రపంచం ముందుకు పయనిచవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో వైభవంగా జరిగిన జి శిఖరాగ్ర సదస్సు తీరు తెన్నులపై అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా,ఫ్రాన్స్ దేశాలు ప్రశంసించాయి. ఏడాదిపాటు అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారతదేశం దేశవ్యాప్తంగా 60 నగరాలలో జి సమావేశాలు నిర్వహించింది. ఈ బాధ్యతలను జాగ్రత్తగా బ్రెజిల్‌కు స్వాధీనం చేసింది. అధికార దండానికి చిహ్నంగా చూపించే ఒక చిన్న కొయ్య
సమ్మెటను లులా డసిల్వాకు ప్రధామంత్రి స్వాధీనం చేశారు. తదుపరి జి సదస్సు 2024 నవంబరు లో రియో డి జనేరియోలో జరుగుతుంది. కాగా అధ్యక్షస్థానంలో ఉన్న భారతదేశం తరపున ప్రధానమంత్రి నరేంద్రమొడీ ముగింపు ప్రసంగం చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారీ మారులు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించినప్పుడు కేలం 51 సభ్యదేశాలు మాత్రమే ఉన్నాయని, కానీ ఈనాడు 200 దేశాలు సభ్యులుగా ఉన్నాయని అందువల్ల కాలానుగుణంగా ఐక్యజ్యాసమితిలో ఇకనైనా సంస్కరణలు జరపాల్సిన అవసరం ఉందని అన్నారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలసంఖ్య ఆనాడూ ఈనాడు ఒకేవిధంగా ఉందని ఈ తీర్పులో మార్పు రావాలని, శాశ్వత సభ్యదేశాల సంఖ్య పెరగాలని మోడీ అన్నారు. ప్రస్తుతం భద్రతామండలిలో అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు మాత్రమే శాశ్వత సభ్యదేశాలుగావీటో పవర్‌తో కొనసాగుతున్నాయి. సభ్యదేశాలకు ఈ సందర్భంగా భారత్ మండపం వద్ద మోడీ మొక్కలు బహుమతులుగా పంపిణీ చేశారు. అన్ని విధాలుగానూ భారతదేశంలో జరిగిన 18వ జి సమావేశంలో చేసిన తీర్మానాలు, సూచనలపై రాబోయే నవంబరు నెల అంతటా పూర్తిగా విస్తారంగా చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో భారత్ పదవీకాలం ముగింపు సందర్భంగా నవంబరు చివరిలో దృశ్యమాధ్యమ పద్దతిలో మరో సమావేశం కూడా నిర్వహించాల్సిన అవసరం ఉదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూన చేశారు. ప్రపంచ నాయకులు ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ప్రాచుర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 55 దేశాలతో కూడి ఆఫ్రికన్ యూనియన్ (ఎయు) ఈ సమావేశాలలో జి శాశ్వత సభ్యత్వం ఇవ్వడాన్ని ఒక ప్రముఖ, ప్రధాన ఘట్టంగా మైలురాయి ఘటనగా ఆయన అభివర్ణించారు.
వంతులవారీ పద్దతి ప్రకారం 2024లో బ్రెజిల్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. 2025లో దక్షిణాఫ్రికా, ఆ తర్వాత 2026లో అమెరికాదేశం ఈ బాధ్యతలు నిర్వహిస్తాయి. ఈ సందర్భంగా లులా డసిల్వా భారత్ ఏడాదికాలంపాటు సమావేశాల నిర్వహణ ద్వారా వహించిన పాత్రను ప్రశంసించారు. ప్రపంచంలో రోజు రోజుకూ ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల వాణిని భారతదేశం సమర్థవంతంగా వినిపించిందని డసిల్వా అన్నారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలలో, భద్రతా మండలిలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ఇనుమడింపజేయాల్సిన అవసరం ఉందని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాశ్వత సభ్యత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని డసిల్వా అన్నారు. అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెరగాలని అన్నారు. అయితే బ్రెజిల్ దేశానికి ఈ బాధ్యతలను భారత్ స్వాధీనం చేసినప్పటికీ కూడా అధికారరికంగా భారతదేశం నవంబరు 30వ తేదీ వరకూ జి అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగుతుంది. ఇంకా రెండున్నర నెలలు ముందునే లాంఛనంగా ఈ సదస్సులో బ్రెజిల్‌కు బాధ్యతలు స్వాధీనం చేసింది. బ్రెజిల్ దేశ అధ్యక్ష బాధ్యతలు డిసెంబరు 1వ తేదీ నుండి ప్రారంభం అవుతాయి. ఈ సందర్భంగా భారతదేశం ప్రపంచశాంతిని కాంక్షిస్తూ ఒక సంస్కృత శ్లోకాన్ని పఠించింది. ఇదిలాఉండగా, అధికారికవర్గాల సమాచారం ప్రకారం, న్యూఢిల్లీలో జి లో సభ్యత్వదేశాల నాయకులు శనివారం ఆమోడించిన “న్యూఢిల్లీ తీర్మానం” 37 పేజీల పాఠంలో రష్యా యుద్ధ పరిస్థితిని చర్చించింది. అందరికీ ఆ మోదయోగ్యమైన తీర్మానం చేసింది. ప్రాదేశిక రాజకీయ సమస్యలు, అభివృద్ధిపై నూటికినూరుశాతం ఏకాభిప్రాయంతో వెలువడిన ఈ తీర్మానంలో ఉక్రేన్‌పై రష్యా దాడి ప్రస్థావనను తొలగించారు. ప్రత్యేకించి రష్యా ప్రస్తావన లేకుండా సార్వత్రిక ప్రకటన తరహాలో ఈ తీర్మానం విడుదలైంది. పొరుగుదేశాల ప్రాదేశిక హక్కులకు, సార్వభౌమత్వానికీ భంగం కలింగించకూడదని పొరుగుదేశాల ప్రాదేశిక సరిహద్దులను గౌరవించవలసి ఉంటుందని తీర్మానం పేర్కొంది. అణుదాడి బెదిరింపులు ప్రపంచ శ్రేయస్సుకు ఏ మాత్రం మంచిదికాదని తీర్మానం పేర్కొంది.
సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలపై
సత్తా రుజువు చేసుకున్న జి బైడెన్
కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సదస్సు ఫలితాలప ‘ఎక్స్’ (ట్విట్టర్)లో వ్యాఖ్యానం చేశారు. భారతదేశం ఈ సదస్సు నిర్వహణ ద్వారా ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు సాధించగలదని నిరూపించుకుందని పేర్కొన్నారు. ఆదివారంనాడు ఉదయం పలువురు జి దేశాల నాయకులు న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఉన్న మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. సమావేశం అనంతరం జో బైడెన్ వియత్నాంకు బయలుదేరి వెళ్ళారు. వాతావరణ సంక్షోభం, సంఘర్షణలు, అత్యంత సున్నితత్వంతో కూడి షాకులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు గురి అయ్యిందని, జి సదస్సు ఇలాంటి తీవ్ర ఒత్తిడి కలిగించే సమస్యలకు పరిష్కారాలు సాధించగల సత్తా ఉందని నిరూపించుకుందని పేర్కొన్నారు. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ సదస్సు ఫలితాలపై మాట్లాడుతూ, భారత్ సారథ్యంలో జి సదస్సు ఒక ఘన విజయం సాధించిందని, అనేక విధాలుగా విజయాలు సాధించి అనేక సమస్యల నుండి ప్రపంచం ముందుకు పయనించేందుకు అవకాశాలు కల్పించిందని అన్నారు. గ్లోబల్ సౌత్ సమస్యలకు ఒక మార్గాన్ని చూపించిందని ఆయన అన్నారు.
ఉమ్మడి చర్యలతో సవాళ్ళు
ప్రతిఘటించాలిః మేక్రాన్
ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ జి ముగింపు సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, ఉమ్మడికృషి ద్వారా సమస్యలు, సవాళ్ళకు పరిష్కారాలు సాధించాలని అన్నారు. జి చర్చలను ప్రాదేశిక రాజకీయాలు హైజాక్ చేయకూడదని, జి కూటమ కేవలం శాంతిని మాత్రమే కోరుకుంటున్నదని, ఈ కూటమిలో విభజనలు రాకూడదని భావిస్తున్నదని అందువల్ల ఘర్షణకు బదులు ఉమ్మడి చర్యలద్వారా పరిష్కారాలు సాధించాలని అన్నారు. ఉక్రేన్ యుద్ధం విషయంలో జి శాంతి, సహకారాలనే కోరుకుంటున్నదనిఉక్రేన్ యుద్ధం, పర్యావరణ సమస్యలపై జి సదస్సు సాధించిన ఫలితాలు ఏ మాత్రం సరిపోవని కుండబద్దలుకొట్టి చెప్పారు. భారత్‌లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ భవిష్యత్ అవసరాల నిమిత్తం ఇంకా ఎక్కువ కృషి జరగాలన్నారు. ప్రపంచ దేశాలకుప్రాతినిధ్యం వహించే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబింపజేయాలన్నారు. ఈనాడు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇందుకు ఒక ప్రధానమైన ఉదాహరణ అని అన్నారు.
వెస్ట్‌ను అడ్డుకోవడంలో
భారత్ ముఖ్యపాత్ర ః లోవరోవ్
పాశ్చాత్యదేశాలకు అడ్డుకట్ట వేయడంలో భారతదేశం ముఖ్యపాత్ర నిర్వహించిందని రష్యా విదేశాంగమంత్రి లోవరోవ్ అన్నారు. ఆయన ఆదివారం పాత్రికేయులతో మాట్లాడుతూ, ఉక్రేన్ సహా అనేక సమస్యలలో పాశ్చాత్యదేశాలు తమ వైఖరిని ముందుకు తీసుకువెళ్ళకుండా అడ్డుకోవడంలో ముఖ్యపాత్ర వహించిందని ప్రశంసించారు. అనేక విధాలుగా భారత్‌లో జరిగిన జి శిఖరాగ్ర సదస్సు ఘన విజయం సాధించి ముందంజ వేసిందని లోవరోవ్ అన్నారు. అనేక సమస్య విసయంలో ముందుకు వెళ్ళేందుకు ఒక మార్గం చూపించిందని అన్నారు. ప్రపంచ పాలనలో, ప్రపంచ ఆర్థిక పెట్టుబడులకుసంబంధించి న్యాయబద్ధమైనస్థాయిలో ముందుకు వెళ్ళే మార్గం ఈ సదస్సు చూపించిందన్నారు. “నేను భారతదేశానికి నా కృతజ్ఞతలు చెప్పాలని కోరుకుంటున్నాను, జి రాజకీయం చేసే చర్యలను భారత్ అడ్డుకున్నందుకుగాను నేను భారత్‌కు నా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను” అని లోవరోవ్ అన్నారు. పాశ్యాత్యదేశాలు ఆధిపత్యధోరణులను నిత్యం ప్రదర్శించలేవని అన్నారు. ప్రపంచంలో కొత్త అధికార కేంద్రాలు పుట్టుకొస్తున్నాయన్నారు.
భద్రతా మండలి, ఇతర సంస్థల్లోసంస్కరణలు జరగాల్సిందే
RELATED ARTICLES