ఎఐటియుసి ఎన్హెచ్ఎం రెండవ ఎఎన్ఎంల యూనియన్ ప్రశ్న
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ రాస్తారోకో
ప్రజాపక్షం / హైదరాబాద్ గత 13 రోజులుగా రెండవ ఎఎన్ఎంలు నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ర్ట ప్రభుత్వం స్పం దించకపోవడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ హిమాయత్‌నగర్ ప్రధాన రహదారిపై సోమవారం ఎఐటియుసి ఎన్హెచ్ఎం రెండవ ఎఎన్ఎంల యూనియన్ సోమవారం రాస్తారోకో నిర్వహించింది. ఈ సందర్భంగా ఎఐటియుసి రాష్ర్ట ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ మాట్లాడుతూ నెల రోజుల నుండి వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ విజ్ఞాపన పత్రా లు అందించిన రెండవ ఎఎన్ఎంల సర్వీసుల క్రమబద్ధీకరణకు ఎలాంటి చొరవ చూపడం లేదని విమర్శించారు. ఈ నెల 16వ తేదీ నుండి నిరవధిక సమ్మెలో ఉన్నారని, 13 రోజుల నుండి రాష్ర్టవ్యాప్తంగా రెండవ ఎఎన్ఎంలు తమ సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని విధులను బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సమ్మె ద్వారా రాష్ర్టంలో అన్ని రకాల వైద్య సేవ లు పేద ప్రజలకు అందకుండా ఉంటూ ప్రజలు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నా రాష్ర్ట ప్రభు త్వం పట్టించుకోవడం లేదని, కేవలం ఎన్నికలు అభ్యర్థుల ప్రకటన, ఓట్లు సాధించడం అనే అంశాలని పరిగణనలోకి తీసుకుంటూ అదే ఆలోచనతో తిరగడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అసెంబ్లీ రద్దు కాకముందే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం చేయడం పట్ల రాష్ర్ట ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతలేమిటో అర్థమవుతోందన్నారు. ఉద్యోగులు, కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళనలు నిర్వహిస్తున్నా రాష్ర్ట ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదని అన్నారు. తక్షణమే ఎన్హెచ్ఏం రెండవ ఏఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని నరసింహ డిమాండ్ చేశారు. ఎఐటియుసి రాష్ర్ట ఉపాధ్యక్షురాలు పి. ప్రేమ్‌పావని మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు తమ సమస్యల పట్ల ఆందోళనలు నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడం పట్ల రాష్ర్ట ప్రభుత్వం మహిళల పట్ల ఉన్న శ్రద్ధను అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళా లోకం చైతన్యం చెంది ఈ రాష్ర్ట ప్రభుత్వానికి గుణపాఠం చెప్పబోతున్నారని హెచ్చరించారు. రాసారారోకోల ఏఎన్ఎంల యూనియన్ రాష్ర్ట గౌరవ అధ్యక్షులు తోట రామాంజనేయులు, రెండవ ఏఎన్ఎంల యూనియన్ నాయకురాళ్లు గుణవతి తిరుపతమ్మ పి ఆండాలు మంజుల, ఎఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి కమతం యాదగిరి, కోశాధికారి బొడ్డుపల్లి కిషన్ తదితరులు పాల్గొన్నారు.