కక్ష్యలోకి డిఎస్ పాటు ఆరు చిన్న ఉపగ్రహాలు
శ్రీహరికోట: పిఎస్‌ఎల్‌వి ప్రయోగం విజయవంతమైంది. దీని ద్వారా సింగపూర్‌కు చెందిన డిఎస్- ప్రధాన ఉప్రగ్రహంతో పాటు ఆరు చిన్న ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. మొత్తం 420కిలోల బరువుగల 7 ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి మోసుకెళ్లింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని
సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు పిఎస్‌ఎల్‌వి వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది ఇస్రో ప్రయోగించిన వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల్లో ఇది మూడోది కావడం విశేషం. ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో అధిపతి డా.సోమనాథ్ మాట్లాడుతూ ఉపగ్రహాలను కచ్చితమైన కక్ష్యలోకి వాహకనౌక ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ‘పిఎస్‌ఎల్‌వి శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపట్టబోతున్నాం. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మరో పిఎస్‌ఎల్‌వి ప్రయోగం ఉంటుంది. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అని సోమనాథ్ అన్నారు.
నింగిలోకి దూసుకెళ్లినపిఎస్‌ఎల్‌వి సి-56
RELATED ARTICLES