ప్రతిపాదించనున్న ప్రతిపక్ష సభ్యులు
స్పీకర్‌కు నోటీసు సమర్పించాలని సమాలోచనలు
న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో ‘ఇండియా’ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించనున్నది. ఈ మేరకు ఒక నోటీసును స్పీకర్‌కు సమర్పించాలని ‘ఇండియా’ కూటమి సమాలోచనలు చేస్తున్నది. మణిపూర్‌లో హింస, విచ్చలవిడిగా జరుగుతున్న అత్యాచారాల సమస్యను యుద్ధప్రాతిపదికపై చర్చించి పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ ప్రధానమంత్రి పట్టీపట్టనట్లు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో జరిగే సాధారణ శాంతి భద్రతల సమస్యలకు మణిపూర్ ప్రత్యేక సమస్యను ముడిపెట్టి చూడటంపట్ల ‘ఇండియా’ తీవ్ర ఆగ్రహంతో ఉంది. అసమర్థ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమాయత్తం అవుతున్నది.మంగళవారంనాడు ‘ఇండియా’ కూటమి వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విషయంపై ‘ఇండియా’ కూటమి సమావేశం మంగళవారం ఉదయం చర్చించింది. ప్రభుత్వ వైఫల్యాలను చాటిచెప్పడానికి ఇది సమర్థవంతమైన
మార్గమేనా అనే అంశంపై వారు చర్చించి అనివార్యంగా ప్రస్తుత పరిపరిస్థితులు ఇందుకు పురిగొల్పుతున్నాయని, ప్రభుత్వం మణిపూర్‌పై చర్చకు చొరవ తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ‘ఇండియా’ భావించింది. ఉభయసభలలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ‘ఇండియా’ కూటమి పార్టీలు ప్రధానంగా చర్చించాయి. కాగా రాజ్యసభలో మణిపూర్ సమస్యపై ప్రభుత్వాన్ని చుట్టుముట్టి ఒత్తిడి చేసే వ్యూహాన్ని ప్రతిపక్షాలు నాలుగోరోజు కూడా కొనసాగించాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం మణిపూర్ సమస్యపై ఎదురుదాడి రాజకీయాన్ని కొనసాగిస్తున్నదేతప్ప నిర్మాణాత్మకమైన చర్చ చేయడం లేదు. ప్రధానమంత్రి లోక్‌సభకు వచ్చి మణిపూర్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలని, దానికి అనుగుణంగానే తదుపరి చర్చ ఈ సమస్యపై కొనసాగాలని ప్రతిపక్షాలు పట్టుపడుతుంటే పాలక బిజెపి ఎంపిలు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై ఎదురుదాడికి దిగుతున్నారు.“నాకు ఈ ప్రతిపాదన గురించి తెలియదు, గతంలో కూడా ప్లామెంటు సమావేశాల్లో వాళ్ళు (ప్రతిపక్షం) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాం అన్నారు, బిజెపి 300 సీట్ల బలంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వాళ్ళు ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారు, రాబోయే ఎన్నికల్లో కూడా బిజెపి ఈసారి 350 సీట్లు సంపాదించుకుని అధికారంలోకి వస్తుంది” అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌జోషి అన్నారు.
2018లో జులై 20వ తేదీన మొదటిసారి లోక్‌సభలో ప్రతిపక్షాలు బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి, ఈ తీర్మానానికి అనుకూలంగా 126 మంది ఓటు వేయగా, ఆనాడు ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్‌డిఎ కూటమి ఎంపిలు భారీ ఎత్తున 325 మంది ఓటు వేశారు. అయితే ఆనాడు భారీ ఎత్తున ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు పడినప్పటికీ ప్రతిపక్షాల్లో తీవ్ర సందేహాలు మిగిలిపోయాయి. వారి బలం అంతసంఖ్యకు లేదు! అవిశ్వాస తీర్మానం పెట్టినట్లయితే ప్రభుత్వంపై పార్లమెంటులో ఆన్ రికార్డులో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి వైఫల్యాలను ఎండగట్టవచ్చు. ఈ వైఫల్యాలన్నీ రికార్డుల్లో నమోదు అవుతాయి. లోక్‌సభ సభ్యుడు ఎవరైనా అవిశ్వాస తీర్మానం ప్రదేశపెట్టవచ్చు. లోక్‌సభ నిబంధనలకు అనుగుణంగా 198వ నిబంధన కింద ఈ తీర్మానంపై చర్చకు నోటీసు ఇవ్వవచ్చు. అయితే కనీసం యాభైమంది ఎంపీలు ఈ తీర్మానంపై సంతకాలు అనుకూలంగా చేయవలసి ఉంటుంది. నోటీసును సభ స్పీకర్ ఆమోదించిన తేదీ నుండి పది రోజుల వ్యవధిలో దీనిపై చర్చకు ఒక తేదీని కేటాయిస్తారు. ఒకవేళ ప్రభ్వుం గనుక ఈ తీర్మానంపై తన బలాన్ని నిరూపించుకోలేకపోతే ప్రధానమంత్రి రాజీనామా చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది ఎంపిలు ఉండగా, ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ కూటమికి 330 మంది ఎంపిల బలం ఉండగా, ‘ఇండియా’ కూటమికి 140కి పైగా ఎంపిల బలం ఉంది. వీరితోపాటు మరో 60 మంది ఎంపిలు ఏ పార్టీకీ చెందనివారుగా చెలామణీ అవుతున్నారు.
మోడీ సర్కార్‌పై ‘ఇండియా’ కూటమిఅవిశ్వాస తీర్మానం
RELATED ARTICLES