న్యూఢిల్లీ: ఐపిఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరో అదిరిపోయే విజయాన్నందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన కీలక మ్యాచ్ లో 77 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ చేరడంతో పాటు క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. లక్నో కంటే మెరుగైన రన్‌రేట్ ఉండటంతో కేకేఆర్‌పై ఆ జట్టు గెలిచినా చెన్నైకి వచ్చే నష్టం ఏం లేదు. చెన్నై ప్లే ఆఫ్స్ చేర డం ఇది 12వ సారి కావడం విశేషం. క్యాపిటల్స్‌తో బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటిన చెన్నై సునాయస విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 223 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 79), డేవాన్ కాన్వే( 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87 )విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దూబే(9 బంతు ల్లో 3 సిక్స్‌లతో 22), రవీంద్ర జడేజా(7 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ బౌలర్లలో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. గిప్టెన్ డేవిడ్ వార్నర్(58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 86) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడగా మిగతా బ్యాటర్లు దారుణం గా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహ ర్ మూడు వికెట్లు తీయగా.. మహీశ్ తీక్షణ, పతీర ణ రెండేసి వికెట్లు పడగొట్టారు. తుషార్ దేశ్‌పాండే, జడేజాకు తలో వికెట్ దక్కింది. పేసర్ల ధాటికి ఢిల్లీ 109 పరుగులకే 5 వికెట్లు కో ల్పోయిన ఢిల్లీ ఏ దశలోనూ కోలుకోలేదు. పృథ్వీ షా(5), ఫిల్ సాల్ట్(3), యశ్ ధుల్(13), అక్షర్ పటేల్(15), హకీమ్ ఖాన్(7), లలిత్ యాదవ్(6) దారుణంగా విఫలమవ్వగా.. కుల్దీప్ యాదవ్(0) డకౌటయ్యాడు.