HomeNewsBreaking Newsముంబై మరో ఓటమి.. !

ముంబై మరో ఓటమి.. !

ముంబైతో జరిగిన ఐపిఎల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈజీ విక్టరీ సాధించింది. చెపాక్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్‌ అవతారం ఎత్తిన కామెరూన్‌ గ్రీన్‌ (6) పెద్దగా ఆకట్టుకోలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (0) మరోసారి డకౌట్‌ అయ్యాడు. ఇక ఇషాన్‌ కిషన్‌ (7) కూడా ఘోరంగా ఫెయిలయ్యాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (26), నేహాల్‌ వధీర (64) ఇన్నింగ్స్‌ నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరూ కూడా భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో ట్రిస్టియన్‌ స్టబ్స్‌ (20) ఒక్కడే రెండంకెల స్కోరు చేశాడు. టిమ్‌ డేవి్‌డ (2) కూడా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడు. ఇలా బ్యాటర్లు అందరూ ఫెయిల్‌ అవడంతో ముంబై పెద్ద స్కోరు చేయలేదు. కేవలం 139 పరుగులే చేసింది. ఈ లక్ష్య ఛేదనలో చెన్నైకి అదిరిపోయే ఆరంభం లభించింది. యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ (30), డెవాన్‌ కాన్వే (44) ఇద్దరూ మంచి షాట్లు ఆడారు. రహానే (21), అంబటి రాయుడు (12) ఫర్వాలేదనిపించారు. ఇలాంటి సమయంలో ఎంఎస్‌ ధోనీ (2 నాటౌట్‌)తో కలిసి శివమ్‌ దూబే (26 నాటౌట్‌) లాంఛనం పూర్తిచేశాడు. దీంతో 17.5 ఓవర్లలోనే చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది. బౌలర్లలో పీయూష్‌ చావ్లా రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. ఆకాష్‌ మధవాల్‌, ట్రిస్టియన్‌ స్టబ్స్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో విజయంతో చెన్నై పాయింట్ల సంఖ్య 13కు చేరింది. దీంతో పాయింట్ల పట్టికలో ఈ జట్టు రెండో స్థానానికి చేరింది. ఏడు విజయాలు, 14 పాయింట్లతో గుజరాత్‌ టైటాన్స్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments