మోడీని గద్దె దించే రోజులు దగ్గరపడ్డాయి
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి
జగిత్యాల : సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో “పల్లె పల్లెకు సిపిఐ ప్రజల వద్దకు సిపిఐ” నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర మంగళవారం రాత్రి జగిత్యాలకు చేరుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య యాత్ర సిపిఐ సభలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, మోడీని గద్దె దింపే రోజులు దగ్గర్లో ఉన్నాయని, ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండానే మోడీ అమలు చేస్తున్నారన్నారు. విద్యను కాషాయికరణ చేస్తే పోరాటం తప్పదని, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. నిత్యావసర ధరలు పెంచిన ఘనత బిజెపికే దక్కిందని, ఉపాధిహామీ పథకాన్ని ఎత్తివేసే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. మోడీ వస్తే అచ్చేదిన్ అవుతుందని అనుకున్నారు కాని సచ్చేదిన్ వచ్చిందని ఎద్దేవా చేశారు. పేదలకోసం పోరాడేది సిపిఐ మాత్రమేనని జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున మహిళలు చాడ వెంకట్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి అజీజ్ పాషా, జగిత్యాల జిల్లా కార్యదర్శి వెన్న సురేష్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, నాయకులు సుతారి రాములు, కొయ్యాడాల సృజన్ కుమార్, పద్మ, గూడెం లక్ష్మీ, శారద పాల్గొన్నారు.
ప్రజలను మోసం చేస్తేఊరుకునేది లేదు
RELATED ARTICLES