హైదరాబాద్: ఐపిఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉప్పల్ వేదికగా ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్‌కు వరుసగా ఇది మూడో ఓటమి కాగా.. ఢిల్లీకి రెండో విజయం. ఈ విజయంతో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్‌పై ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రివేంజ్ తీర్చుకోగా.. పేలవ బ్యాటింగ్‌తో సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమిపాలైంది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(34 బంతుల్లో 4 ఫోర్లతో 34), మనీశ్ పాండే(27 బంతుల్లో 2 ఫోర్లతో 34) మినహా అంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో సుందర్ మూడు వికెట్లు తీయగా.. భువీ రెండు వికెట్లు పడగొట్టారు. నటరాజన్‌కు ఓ వికెట్ దక్కింది. లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేసి ఓటమిపాలైంది. మయాంక్ అగర్వాల్(39 బంతుల్లో 7 ఫోర్లతో 49), హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), వాషింగ్టన్ సుందర్(15 బంతుల్లో 3 ఫోర్లతో 24 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. హై ప్రైజ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్(7) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. అన్రిచ్ నోర్జ్ బౌలింగ్‌లో ఇన్నోవేటివ్ షాట్ ఆడే క్రమంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా నిదానంగా ఆడగా.. మయాంక్ అగర్వాల్ బౌండరీలు బాదాడు. త్రిపాఠి(15)ని ఇషాంత్ శర్మ క్యాచ్ ఔట్ చేయగా.. అభిషేక్ శర్మ(3)ను కుల్దీప్ యాదవ్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్(్ర3)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో సన్‌రైజర్స్ 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో హెన్రీచ్ క్లాసెన్(31), వాషింగ్టన్ సుందర్ జట్టును ఆదుకున్నారు. పరుగుల భాగస్వామ్యం అనంతరం భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్లాసెన్ ఔటవ్వగా.. క్రీజులోకి మార్కో జాన్సెన్ వచ్చాడు. సుందర్ బౌండరీ బాదడంతో ఆఖరి ఓవర్‌లో సన్‌రైజర్స్ విజయానికి 13 పరుగులు అవసరమయ్యాయి. ముఖేశ్ కుమార్ ఐదు పరుగులే ఇవ్వడంతో ఢిల్లీ విజయం లాంఛనమైంది.
గెలిచే మ్యాచ్‌లోఓడిన సన్‌రైజర్స్!
RELATED ARTICLES