HomeNewsBreaking Newsభానుడి విశ్వరూపం

భానుడి విశ్వరూపం

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ఎండలు
44 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
ప్రజాపక్షం/హైదరాబాద్‌/ జయశంకర్‌ భూపాలపల్లి

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. దాంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక రాష్ట్రం లో బుధవారం పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా జయశంకర్‌ భూపాపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 44.5 గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తలమడుగు (ఆదిలాబాద్‌) 44.3, కీతవారిగూడెం (సూర్యాపేట) 44.2, వెల్గటూరు (జగిత్యాల) 44.2, కొల్లాపూర్‌ (నాగర్‌కర్నూల్‌) 44, తాడ్వాయి (ములుగు) 44, గరిమెల్లపాడు (భద్రాద్రి కొత్తగూడెం), 44, కొమ్మెర (మంచిర్యాల) 43.9, చప్రాలా (ఆదిలాబాద్‌) 43.9, భిక్కనూర్‌ (కామారెడ్డి) 43.8, పజ్జూరు (నల్లగొండ) 43.8, ధర్మసాగర్‌ (హన్మకొండ) 43.8, జైనత్‌ (ఆదిలాబాద్‌) 43.7, పాత కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం) 43.7, సుజాతనగర్‌ (భద్రాద్రి కొత్తగూడెం) 43.7, కొండాపూర్‌ (మంచిర్యాల) 43.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత లు రికార్డయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
భూపాలపల్లిలో భానుడి భగ భగ..
సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లి, ఒకపక్క బొగ్గు మరొకపక్క జెన్కో వేడితో రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో మధ్యా హ్నం సూర్యుడు సలసల మండుతున్నాడు. కోల్‌బెల్టుగా ఉన్న భూపాలపల్లి ప్రాంతంలో ఎండ వేడిమి తీవ్రత బాగా ఉంటోంది. బుధవారం 42 డిగ్రీలకు
.పలు జిల్లాలకు వర్ష సూచన..
ఓ వైపు పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. ఎప్పుడు ఎండ కాస్తుందని, ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపారు. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments