HomeNewsBreaking Newsరాజస్థాన్‌ హ్యాట్రిక్‌ విజయం

రాజస్థాన్‌ హ్యాట్రిక్‌ విజయం

అహ్మదాబాద్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజూ శాంసన్‌(60), హెట్‌మెయిర్‌(56 నాటౌట్‌) అర్ధ శతకాలతో చెలరేగారు. నూర్‌ అహ్మద్‌ వేసిన 20వ ఓవర్‌ హెట్‌మెయిర్‌ సిక్స్‌ కొట్టి గెలిపించాడు. దాంతో, గత సీజన్‌లో ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఛేదనలో రాజస్థాన్‌ రాయల్స్‌కు శుభారంభం దక్కలేదు. హార్దిక్‌ పాండ్యా రెండో ఓవర్‌ మూడో బంతికి యశస్వీ జైస్వాల్‌(1)ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత బట్లర్‌ను షమీ డకౌట్‌ చేశాడు. 4 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్‌ చేరడంతో రాజస్థాన్‌ కష్టాల్లో పడింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌(26), కెప్టెన్‌ సంజూ శాంసన్‌(60) మూడో వికెట్‌కు 43 రన్స్‌ చేశారు. రియాన్‌ పరాగ్‌(5) మళ్లీ నిరాశ పరిచాడు. 29 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్స్‌లతో శాంసన్‌ యాభై రన్స్‌ చేశాడు. ఆ తర్వాత ధ్రువ్‌ జురెల్‌ (18) దంచి కొట్టాడు. హెట్‌మెయిర్‌ అర్ధ శతకంతో చెలరేగి జట్టును గెలిపించాడు. గుజరాత్‌ బౌలర్లలో షమీ మూడు, రషీద్‌ ఖాన్‌ రెండు వికెట్లు తీశారు. నూర్‌ అహ్మద్‌ ఒక వికెట్‌ తీశారు. గ్రౌండ్‌లో మొదట బ్యాటిం గ్‌ చేసిన గుజరాత్‌ టైటన్స్‌ 177 పరుగులు చేసింది. డేవిడ్‌ మిల్లర్‌(46), శుభ్‌మన్‌ గిల్‌(45), అభినవ్‌ మనోహర్‌(27), దంచి కొట్టడంతో పోరాడగలిగే స్కోర్‌ చేయగలిగింది. తొలి ఓవర్‌లోనే ట్రెంట్‌ బౌల్ట్‌ గుజరాత్‌కు షాకిచ్చాడు. ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహ(5)ను ఔట్‌ చేశాడు. ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్‌(16) రనౌట్‌ కావడంతో 32 వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత శుభ్‌మన్‌ గిల్‌(45), హార్దిక్‌ పాండ్యా(28) రాజస్థాన్‌ స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగారు. మూడో వికెట్‌కు 62 రన్స్‌ చేశారు. అభినవ్‌ మనోహర్‌(27), డేవి్‌డ మిల్లర్‌(46) ధాటిగా ఆడి స్కోర్‌ 150 దాటించారు. రాజస్థాన్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ రెండు వికెట్లు తీశాడు. బౌల్ట్‌, చాహల్‌, జంపాకు ఒక్కో వికెట్‌ దక్కింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments