బెంగళూరు: ఐపిఎల్ 2023 సీజన్‌లో లక్నోసూపర్ జెయింట్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సిబి నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాప్-3 బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79 నాటౌట్), గ్లేన్ మ్యాక్స్‌వెల్(29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్ వు్‌డ తలో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్ష్యచేధనకు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులు చేసి గెలుపొందింది. మార్కస్ స్టోయినిస్(30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65), నికోలస్ పూరన్(19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 62) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆఖరి బంతికి ఒక్క పరుగు చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్‌సిబి వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తప్పిదం.. లక్నోకు కలిసొచ్చింది. బంతి తగలకపోయినా.. పరుగు కోసం ఆవేశ్ ఖాన్ పరుగెత్తగా.. బంతిని కలెక్ట్ చేసి రనౌట్ చేయడంలో దినేశ్ కార్తీక్ విఫలమయ్యాడు.
ఉత్కంఠ పోరులో లక్నో గెలుపు
RELATED ARTICLES