సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం/కరీంనగర్ ప్రతినిధి ఇండ్లు, ఇళ్ల్ల స్థలాలు లేని నిరుపేదల కోసం భూ ఆక్రమణ పోరాటాలకు వ్యవసాయ కూలీలు సిద్ధం కావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యు లు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల ముగింపు సందర్భంగా చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజల్లో చాలా మంది ఉండడానికి ఇండ్లు, స్థలాలు లేక అద్దె భవనాల్లో ఉంటూ చేతి నిండా పనిలేక, తినడానికి తిండి లేక అర్ధాకలితో అల్లాడుతూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని, హామీలు గాలిమాటలుగా మారి ప్రజల సంక్షేమం పడకవేసిందన్నా రు. దేశంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కార్మిక హక్కులను కాలరాస్తూ చట్టాలను హరించి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని, యువతకు ఉపాధి అవకాశం కల్పించకుండా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తున్నారని, నరేంద్రమోడీ ఉపాధిహామీ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర చేస్తూ కూలీలకు పని కల్పించకుండా జాతీయ గ్రామీణ ఉపాధి కూలీల కడుపుకొడుతున్నారన్నారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రతిఘటన పోరాటాలను సాగించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బికెఎంయు జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా, జాతీయ కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు టి.వెంకట్రాములు, మోతె లింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కాంతయ్య, బాల మల్లేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, ఆఫీసు బేరర్స్ కొయ్యడ సృజన్ కుమార్, తాటి వెంకటేశ్వర్లు, జంగయ్య, బాపు దుబాసి రాములు, బోయిని అశోక్, కయ్యం సుజాత తదితరులున్నారు
భూఆక్రమణ పోరాటాలకు కూలీలు సిద్ధం కావాలి
RELATED ARTICLES