HomeNewsBreaking Newsతొమ్మిదేళ్లయినా విభజన హామీల

తొమ్మిదేళ్లయినా విభజన హామీల

వాగ్దానాలు నెరవేర్చని బిజెపికి ఓట్లడిగే హక్కు లేదు
విభజన హామీల అమలుకు పార్లమెంటు ఎదుట సిఎం కెసిఆర్‌ ధర్నా చేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
బయ్యారంలో ప్రారంభమైన ‘ప్రజా పోరుయాత్ర’
ప్రజాపక్షం / మహబూబాబాద్‌ ప్రతినిధి
ఆంధ్రప్రదేస్‌ విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను అమలు చేయని బిజెపికి తెలంగాణలో ఓట్లడిగే హక్కు లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నా రు. విభజన హామీల సాధన కోసం సిపిఐ చేపట్టిన ప్రజాపోరు యాత్రను కూనంనేని సాంబశివరావు శనివారం మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో ప్రారంభించారు. పాదయాత్రకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు జెండా ఊపారు. అనంతరం సిపిఐ మహబూబాబాద్‌ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి అధ్యక్షతన జరిగిన పాదయాత్ర ప్రారంభ సభలో కూనంనేని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్నదని, కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచి నా విభజన హామీలను అమలు చేయలేదని అన్నా రు. అందుకే సిపిఐ ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్రను ప్రారంభించామని, విభజన హామీల సాధన కోసం సిఎం కెసిఆర్‌ విపక్షాలను కలుపుకుని పార్లమెంటు ఎదుట ధర్నా చేయాలని సూ చించారు. కేంద్రంలోని బిజెపి అరడజను దొంగల కోసం దేశాన్ని దోచి పెడుతున్నదని, వారిని సాగనంపాలని, వంద సంవత్సరాల నుండి అధికారం లో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన సిపిఐ పోరాడుతున్నదన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా పార్లమెంటులో చట్టం చేసిన ప్రకారం విభజన హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా… కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాలయాపన చేస్తూ దేశాన్ని నీరవ్‌ మోడీ, అదానీ, ఇతర ఆరుగురికి దోచి పెడుతున్నదన్నారు.
అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్నారని, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సిపిఐ పోరుయాత్ర తల పెట్టిందని చెప్పారు. బయ్యారం ఉక్కును అక్రమంగా రక్షణ స్టీల్‌కు లక్షల టన్నుల తరలించడాన్ని 2010 సంవత్సరంలో అడ్డుకొని అప్పటి ప్రభుత్వానికి అసెంబ్లీ తెలియ చేసి ఆపడం జరిగిందని, సిపిఐకి మాత్రమే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై అడిగే హక్కు ఉందన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారని, కాంగ్రెస్‌పార్టీ నాయకుడు రాహూల్‌ గాంధీపై మోడీ పేరు మీద విమర్శలు చేశారని, 2019లో బిజెపి నాయకులు సూరత్‌ కోర్టులో కేసు వేశారని, ఇప్పుడు పార్లమెంటు సభ్యత్వానికి రాహుల్‌ను అనర్హుడిని చేశారని కేంద్రంపై, బిజెపి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. ప్రజా పోరుయాత్ర కన్వీనర్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ నెల 25 నుండి ఆరు జిల్లాల మీదుగా ఏప్రిల్‌ 5 వరకు ములుగు, హన్మకొండ, మహబూబాబాద్‌, జనగాం , వరంగల్‌ , భూపాల పల్లి జిల్లాల మీదుగా యాత్ర కొనసాగుతుందని, ప్రజలు ప్రజాస్వామిక వాదులు పోరుయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రాజారెడ్డి, భూపాలపల్లి కార్యదర్శి రాజ్‌కుమార్‌, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి,వరంగల్‌ జిల్లా కార్యదర్శి మేకల రవి,ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు, రాష్ట్ర సమాఖ్య ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మండ సదాలక్ష్మి, నాయకులు పంజాల రమేష్‌, బి. అజయ్‌,షేక్‌ బాష్‌ మియా, నల్లు సుధాకర్‌రెడ్డి,పాతూరి సుగుణ, ఆదరి శ్రీనివాస్‌,మాగం లోకేష్‌ , ఏపూరి భ్రహ్మం, అజయ్‌ సారధి, కట్టె బోయిన శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments