HomeNewsBreaking Newsరైతు వ్యతిరేక చట్టాలతో అన్నదాత దివాళా

రైతు వ్యతిరేక చట్టాలతో అన్నదాత దివాళా

పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి ఆర్థిక చేయూతనందించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్‌

ప్రజాపక్షం/పాల్వంచ/కొత్తగూడెం రైతును రాజు చేస్తామన్న పాలకుల హామీలు అమలుకు నోచుకోకపోగా రైతాంగ వ్యతిరేక చట్టాలను రూపొందిస్తూ రైతును దివాళా తీయిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. స్వామినాధన్‌ సిఫారసులను పరిగణలోకి తీసుకొని రైతాంగానికి చేయూతనందించాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల అప్పుడు డబ్బు సంచులతో కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చే టూరిస్ట్‌ నాయకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆదివారం పాండు రంగపురంలో జరిగిన ఉమ్మడి పాండురంగపురం, సూరారం పంచాయతీల ఏడు బూత్‌ స్థ్ధాయి కార్యకర్తల సమావేశం మండల సహాయ కార్యదర్శి గుండాల నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ, ఇందన ధరలు, నిత్యావసర ధరలతో ప్రజలు సతమతమవుతుంటే ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యహరిస్తున్నాయని, ఇటీవల గ్యాస్‌ ధరలను పెంచిన కేంద్రం పేదొడి నడ్డివిరుస్తోందని విమర్శించారు. ధరలను అందుబాటులోకి తెచ్చి పేదలు కనీసం రెండు పూటలా తిండితినే వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న పేదలకు గృహ వసతి కల్పించి వారి సొంతిటి కలను నెరవేర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తి స్ధాయిలో జరగలేదని, ఇంకా ఎన్నేళ్ళకు నిర్మాణాలు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. లక్షల్లో పేదలు ఉంటే వేలల్లో నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. ప్రభుత్వ స్ధలాల్లో పక్కా గృహాలు నిర్మించి అర్హులైన పేదలకు అందించాలని, సొంత స్ధలం ఉన్న వారికి రూ 6లక్షల మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. పేద ప్రజలకు అండగా కమ్యూనిస్టులేనని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ పాలకులు, అధికారులను నిలదీసే సత్తా ఉన్న కమ్యూనిస్టు పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాధం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబు, జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్‌, నాయకులు గుండెపురి రాజు, ఇరుకుల పాటి నారాయణ, సర్పంచ్‌ భూక్య రమేష్‌, కోటి నాగేశ్వరరావు, ఇరుకులపాటి సుధాకర్‌, ఎర్రగడ్డ సత్యనారాయణ, నెల్లూరి సతీష్‌, జక్కుల సురేష్‌, ఆవుల సతీష్‌, ఇరుకులపాటి నాగేశ్వరరావు, జక్కుల సత్యనారాయణ, కొత్త సురేష్‌, గుగులోత్‌ భిక్షం, డేవిడ్‌, నాయక్‌, వెంకట్‌ నారాయణ, కే కృష్ణ, వడ్లకొండ మేరమ్మ, వెంకన్న చారి, రేగు కృష్ణమూర్తి, కొత్త మధు, లింగంపల్లి నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సురేష్‌, సంతోష్‌, మహమ్మద్‌ పాషా, కురు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు భరోసా కల్పించే కేంద్రాలు కమ్యూనిస్టు కార్యాలయాలు
వందేళ్ళుగా ప్రజలకు ఎనలేని సేవలందిస్తూ కమ్యూనిస్టు కార్యాలయాలు ప్రజలకు భరోసా కల్పించే కేంద్రాలుగా నిలుస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. చుంచుపల్లి మండల పరిధిలోని బాబూక్యాంపు ఏరియా మెయిన్‌ రోడ్డులో నూతనంగా నిర్మించనున్న ‘రజబ్‌ అలిభవన్‌’ నిర్మాణానికి ఆదివారం కూనంనేని శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన శంకుస్థాపన సభలో కూనంనేని మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీకి, కమ్యూనిస్టు ఉద్యమాలకు వందేళ్ళకుపైగా చరిత్ర ఉందని, ఎందరో తాగదనులు నిర్మించిన కమ్యూనిస్టు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన భాద్యత నేటితరం నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. నూతనంగా నిర్మిస్తున్న రజబ్‌ అలి భవన్‌తో ప్రజలకు మరింత సేవలు అందుతాయన్నారు. చుంచుపల్లి మండలంలో అనాదిగా సిపిఐ పార్టీని ప్రజలు ఆదరిస్తూ తగిన గుర్తింపును అందిస్తున్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు ప్రజల్లో మరింత మమేకమై పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments