వంటగ్యాస్ ధర రూ. 50 పెంపు
వాణిజ్య సిలిండర్‌పై రూ. 350 భారం
ఇదే గిఫ్ట్ ప్రతిపక్షాల విమర్శ
న్యూఢిల్లీ : సామాన్యులపై మళ్లీ పిడుగు పడింది. ఎనిమిది నెలల విరామం తరువాత గ్యాస్ ర్ ధరలు భారీగా మోదారు. ఇప్పటికే నిత్యావసరా ల ధరలన్నీ మండిపోతుంటే.. ఇక ఇప్పుడు గ్యాస్ సిలిండర్‌పై కూడా వడ్డన మొదలైంది. బుధవారం నాడు వంటగ్యాస్ ఎల్పిజి ధర రూ. 50 పెంచా రు. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే వంటగ్యాస్ ధరలు పెంచడం గమనార్హం. అయితే ధరల పెంపుపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1,053గా ఉన్న 14.2 కిలోల ఎల్‌జిపి సిలిండర్ ధర తాజా పెంపుతో రూ. 1,103కు పెరిగింది. ఈ మేరకు దేశీయ ఇంధన రిటైలర్లు ధరల నోటిఫికేషన్‌ను జారీ చేశారు. 14.2 కిలోల సబ్సిడియేతర ఎల్పిజి సిలిండర్ ధర రరూ.1103గా ఉన్నట్లు దేశీయ ఇంధన సంస్థలైన ఐఒసి, బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్ వెల్లడించాయి. ఉజ్వల వినియోగదారు కాని వారికి ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీని చెల్లించడం లేదు. అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచితంగా ఎల్పిజి కనెక్షన్ పొందిన 9.58 కోట్ల పేదలకు ఒక్కో సిలిండర్‌కు రూ. 200 సబ్సిడీని ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రస్తుత పెంపుతో ఈ పథకం కింద ఒక్కో సిలిండర్ ధర రూ. 903కు పెరిగింది. దేశీయ ఇంధన రిటైలర్లు ధరలకు అనుగుణంగా నెలవారీ రేట్లను సవరించాలి. కానీ, 2020 సంవత్సరం నుంచి ఆ విధంగా చేయడం లేదు. జూన్ 2020 2022 మధ్య వారికి వచ్చిన నష్టాలను పూడ్చేందుకు గత ఏడాది అక్టోబర్‌లో రూ.22,000 కోట్లు ఇచ్చారు. కాగా, గృహాలకు వాడే ఎల్పిజి ధరను చివరి సారిగా జులై4, 2022న సవరించారు. ప్రస్తుత పెంపుతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 1,102.50కి చేరగా, కోల్‌కతాలో రూ. 1,129కి, చెన్నైలో రూ. 1,118.50కి పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో ధరల్లో తేడాలు ఉండనున్నాయి. అదే విధంగా ఇంధన సంస్థలు హోటళ్లు, రెస్టారెంట్లకు ఉపయోగించే వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర రూ. 350.5 పెంచారు. తాజా పెంపుతో 18 కిలోల సిల్డర రూ. 2,119.5కు చేరింది. చివరిసారిగా వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధరను జనవరిలో రూ. 25 పెంచారు. అదే విధంగా ధనవంతులు ప్రయాణం చేసే విమనాల్లో వాడే ఇంధన ఎటిఎఫ్ ధరను మాత్రం 4 తగ్గించారు. దీంతో జెడ్ ఇంధన ధరలు ఢిల్లీలో కిలోలీటర్‌కు రూ. 4,606.50 తగ్గగా, ఇప్పుడు ధర రూ. 1,07,750.27గా ఉంది. ఎటిఎఫ్ ధరలను అంతర్జాతీయ బెంచ్‌మార్క్, విదేశీ ఎక్సేంజ్ ధరలను సగటు ధర ఆధారంగా ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. పెట్రోల్, డీజిర్ ధరలను 11 నెలల నుంచి స్తంభింపజేశారు. దేశ రాజధానిలో పెట్రో ల్ ధర రూ. 96.72గా ఉండగా, డీజిల్ ధర రూ. 89.62గా ఉంది. ఇదిలా ఉండగా, వంటగ్యాస్ ధరలు పెరగడంతో ప్రతిపక్షాలు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. హోలీ పండుగ ముందు ధరల పెంచడం ఏమిటని నిలదీశాయి. మోడీ ప్రభుత్వ హయాంలో వెన్నుపోటు ద్రవ్యోల్బణం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. వంటగ్యాస్ ధర పెంపును శివసేన ఉద్ధవ్ థాక్రే బాలాసాహెబ్ థాక్రే వర్గానికి చెందిన ప్రియాంక చతుర్వేది హోలీ కానుకగా అభివర్ణించారు.