సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/మేడ్చల్ ప్రతినిధి పేదల ప్రజల అత్యంత దుర్మార్గపు శత్రువు ప్రధాని మోడీ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పెట్రోల్, డీజిల్, ధర లు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు కొనలేక, తినలేక దుర్భరమైన జీవితాలను అ నుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశా రు. సామాన్యుల సమస్యలేవీ మోడీ పట్టించుకోకుండా నియంత ధోరణిలో కార్పొరేట్ల కోసమే పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చే శారు. సిపిఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమితి సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి ఇ.ఉమామహేశ్ అధ్యక్షతన బుధవారం హిమాయత్‌నగర్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధుమ్భవన్లో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు భరించలేని జీవన వ్యయంతో సతమతమౌతున్నారని విమర్శించారు. ఆర్థిక సంక్షో భం, నిరుద్యోగం తదితర సమస్యలు దేశంలో సామాన్యుడి ఆర్థిక సామర్థ్యాన్ని అట్టడుగు స్థాయికి నెట్టాయన్నారు. మోడీ పాలనలో పేద లు అత్యంత పేదలుగా మారారని, ధనికులు అత్యంత సంపన్నులుగా మారారని అన్నారు. బిజెపి తిరోగమన విధానాలు దేశ ప్రయోజనాలకు ప్రమాదకరంగా మారాయని అన్నారు. వీ టిని ప్రతిఘటించేందుకు పోరాటాలు తీవ్ర త రం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు, అర్హులైన పేదలకు ఇండ్ల స్థ లాలు, ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, తదితర సం క్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని పాలకులను నిలదీయాలని అన్నారు. అపరిష్కృత సమస్యల పరిష్కారానికి సిపిఐ శ్రేణులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.బాలమల్లేష్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా సిపిఐని బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి డి.జి.సాయిలుగౌడ్, సహాయ కార్యదర్శి దామోదర్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు కె.ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.
సామాన్యుడి ఆర్థిక సామర్థ్యం అట్టడుగు స్థాయికి…
RELATED ARTICLES