HomeNewsBreaking Newsదమ్మున్న ప్రధాని ఉంటే… దేశంలో 24 గంటల విద్యుత్‌

దమ్మున్న ప్రధాని ఉంటే… దేశంలో 24 గంటల విద్యుత్‌

భారత నీటిపారుదల విధానాన్ని బంగాళాఖాతంలో పడేయాలి
మన్మోహన్‌సింగ్‌ పాలనతో పోలిస్తే మోడీ ప్రభుత్వం అన్నింటా విఫలం
గత ప్రభుత్వంలో ద్రవ్యలోటు 4.77 శాతం కాగా, ప్రస్తుత ద్రవ్యలోటు 5.1 శాతం
లెక్కలు అబద్ధాలని నిరూపిస్తే సిఎం పదవికి రాజీనామా చేస్తా
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటన
ప్రజాపక్షం/హైదరాబాద్‌
మన్మోహన్‌ సింగ్‌ పాలనతో పొలిస్తే, మోడీ ప్రభుత్వ హయాంలో దేశం అన్ని రంగాల్లో ఘోరంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ అత్యంత అసమర్థ ప్రధాని అని దుయ్యబట్టారు. మన్మోహన్‌ హయాంలో ద్రవ్యలోటు 4.77 శాతం, జిడిపి 52.2 శాతం ఉండగా, మోడీ హయాంలో ద్రవ్యలోటు 5.1, జిడిపి 56.2 శాతం నమోదైందని, తాను ప్రస్తావించిన లెక్కల్లో ఒక్కమాట అబద్ధమైనా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెసిఆర్‌ సవాల్‌ విసిరారు. ఈ దేశ నీటిపారదుల పాలసీ తీసి బంగాళాఖాతంలో పడేయాలని, భవిష్యత్‌లో తమ ప్రభుత్వం వస్తుందని, తాము భారతదేశంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తామనిహమీనిచ్చారు. దమ్మున్న ప్రధాని ఉంటే దేశంలో 24 గంటల విద్యుత్‌ ఎందుకు సాధ్యం కాదన్నారు. శాసనసభలో ద్రవ్య వినియమ బిల్లు ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా కెసిఆర్‌ మాట్లాడుతూ మోడీ కన్నా కూడా మన్మోహన్‌ సింగే ఎక్కువ పనిచేశారని, అయితే, ఆయన అవేవీ చెప్పుకోలేదన్నారు.పూజా మెహ్రా రాసిన ’ది లాస్ట్‌ డికేడ్‌’ లో వాస్తవాలు ఉన్నాయని, దీనిని అందరూ చదవాలని సూచించారు. దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నదని, 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఈ రోజుకీ పక్షపాత ధోరణులు కనపడుతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.మహారాష్ట్రతో సంప్రదింపులు చేసి మనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోలేదా?, అన్నారు. 40వేల టీఎంసీలు ఇస్తే దేశమంతా సుభిక్షం అవుతుందని, దేశంలో నీటి కోసం యుద్ధాలే ఉండబోవని, మరో 10వేల టీఎంసీలను తాగునీటికి, పరిశ్రమలకు ఇచ్చినా, మరో 25-30వేల టీఎంసీలు అదనంగా ఉంటాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.495కోట్లను ఏడేళ్లుగా అడుగుతున్నప్పటికీ వాటిని కేంద్రం ఇవ్వడం లేదన్నారు. గతంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు నిధులు కేటాయించలేదని హరీశ్‌, ఈటల రాజేందర్‌ అడిగితే ’ఏం చేసుకుంటారో చేసుకోండి’అని అన్నారని, ఆ తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎక్కడున్నారో అందరికీ తెలుసన్నారు. గోద్రా అల్లర్లపై బీబీసీపై డ్యాకుమెంటరీ తీస్తే దానిని బ్యాన్‌ చేయాలని అశ్వనీ ఉపాధ్యాయ అనే న్యాయవాది న్యాయస్థానానని ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంత అహంకారమా?, అంత ఉన్మాదమా? సుప్రీంకోర్టులో కేసు వేస్తే దేశానికి అలంకారమా? మన గురించి ప్రపంచం ఏమనుకుంటుందని, ఇంత అసహన వైఖరి అవసరమా?, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతి ఇదేనా? అని మండిపడ్డారు. మనుషులన్నాక తప్పులు జరుగుతాయని, ఒప్పుకోవాలని, కొన్నిసార్లు నోరుజారి మాట్లాడితే క్షమాపణ కోరితే తప్పేముందని ప్రశ్నించారు జులుం, అహంకారం ఎన్నిరోజులు ఉంటుందని, రాబోయే 2024 తర్వాత కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. ఒక వైపు మోడీ ప్రభుత్వం దివాళా తీస్తూ మరోవైపు తామే గొప్పవాళ్లమని చెప్పుకుంటున్నారన్నారు.
ఫెడరలిజం అంటే ఇదేనా
దేశంలో 157 మెడికల్‌ మంజూరుచేస్తే ఇందులో తెలంగాణకు ఒక్క కాలేజీ లేదని, ఇది ప్రజాస్వామ్యమా?, కో-ఆపరేటివ్‌ ఫెడరలిజం అంటే ఇదేనా?అని మండిపడ్డారు. 157 నర్సింగ్‌ కాలేజ్‌ మంజూరు చేస్తే, ఒకటి కూడా రాదా? కేవలం తెలంగాణకు మాత్రమే కాదని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరిగినా జరిగినట్టే. ఈటెల రాజేందర్‌ అనేక విషయాలను ప్రస్తావించారు. వాటిని స్వాగతిస్తాం. వాటిపై చర్చిస్తామన్నారు.
అదానీ ఉపద్రవాన్ని తప్పించేందుకు ఏం చేయబోతోంది
అదానీ వ్యవహారం చూస్తుంటే దేశ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని, అదానీ రూపంలో వచ్చిన ఉపద్రవం తప్పించేందుకు ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతోందని కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ అడుగుతుంటే ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని కెసిఆర్‌ అన్నారు. కనీసం కమిటీ వేసి విచారణ జరుపుతామని కూడా చెప్పటం లేదన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఏం చెబుతారని, ఆయన సంస్థ ఏం చేసిందో తెలియదన్నారు.అదానీ సంపద 112 బిలియన్‌ డాలర్లు కరిగిపోయిందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, అదానీ సంస్థల్లో పలు బ్యాంకులతో పాటు, ఎల్‌ఐసీ కూడా పెట్టుబడులు పెట్టిందని, ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఏం చేయబోతోందనే విషయాన్ని ’ది ఎకానమిస్ట్‌’ తన కథనంలో రాసిన విషయాన్ని కెసిఆర్‌ వివరించారు. అసలు విషయం పక్కన పెట్టి, మోడీ జబ్బలు చరుచుకుంటున్నారని, నెహ్రూ, ఇందిరా గాంధీల గురించి మాట్లాడతారని, వాళ్లు చనిపోయి ఎంతో కాలమైందని, వాళ్లు ఏం చేశారో చెప్పటం ఇప్పుడు అవసరమా?అని ప్రశ్నించారు.

అన్నీ తట్టుకుని నిలబడ్డాం:
ఇరిగేషన్‌ ప్రాజెక్టుల విషయంలో ఎన్నో అడ్డంకులు సృష్టించారని, అయినా వాటిని తట్టుకుని నిలబడ్డామని కెసిఆర్‌ అన్నారు. . నీళ్లు తీసుకొచ్చామని,చెరువులు తవ్వించామని,చెక్‌డ్యామ్‌లను నిర్మించామని,పంజాబ్‌ను మించే పరిస్థితిని తీసుకొచ్చామని, భారతదేశంలో రెండో ర్యాంకులో ఉన్నామని , మొదటి స్థానానికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిదలేదని అన్నారు. రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్న ఉద్యోగులకు కూడా జీతాలు పెంచుతామని, చిరు ఉద్యోగులకు కూడా రెగ్యులర్‌ ఉద్యోగుల తరహాలోనే జీతాలు పెంచుతామన్నారు.
బిజెపికి ఓటు ఎందుకు వేయాలి
తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేని కేంద్రంలోని అధికార బిజెపికి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని కెసిఆర్‌ ప్రశ్నించారు. దేశ వృద్ధిలో తెలంగాణ సహకారం ఎంతో ఉన్నదని, దేశ జనాభాలో మనం 3శాతం ఉంటే, జీడీపీలో 4.9శాతం వాటా ఉన్నదని తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ప్రధాని మోడీని కలిస్తే, ఆయన చెప్పింది వేరు, చేసింది వేరని అన్నారు. వడ్లు కొనమంటే కొనరని, అదేమంటే, ప్రజలకు నూకలు తినడం నేర్పించాలని సలహాఇస్తారని కెసిఆర్‌ అన్నారు. ఎంత అహంకారమా?, తమపై ఎన్ని కుట్రలు చేశారో ఈటల రాజేందర్‌ సహా అందరికీ తెలుసన్నారు.

ఒక డీలర్‌తో కేంద్ర మంత్రి కొట్లటనా..?
ఎన్డీయే అంటే నో డేటా అవేలేబుల్‌ అని ఎద్దేవా చేశారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వచ్చి కామారెడ్డిలో ఒక డీలర్‌ షాపు వద్ద ప్రధాని మోదీ ఫొటోలేదని కొట్లాడారిన అన్నారు. ఒక దేశ ఆర్థికమంత్రి రేషన్‌ డీలర్‌తో కొట్లాడతారా?, ఏం సాధించారని మోడీ ఫొటో పెట్టుకోవాలని, మెడికల్‌ కాలేజీ అడిగితే ఇవ్వలేదని, మంత్రి సత్యవతి రాథోడ్‌ నాలుగైదు సార్లు వెళ్లి వచ్చిన విషయాన్ని కెసిఆర్‌ గుర్తు చేశారు. చ్చారు. ములుగు దగ్గర జాగా చూపించినా ఇప్పటికీ దిక్కులేదు.

ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగాలె
దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంట్లో చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ అలా జరగడం లేదని కేసీఆర్‌ అన్నారు. భారతదేశం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందంటున్నారని, ఇది చాలా తక్కువ అపి. అభివృద్ధికి సూచిక అయిన తలసరి ఆదాయంలో భారత్‌ 138వ స్థానంలో ఉన్నదని, కానీ బంగ్లాదేశ్‌, భూటాన్‌, శ్రీలంక కంటే మన తలసరి ఆదాయం తక్కువ అని అన్నారు. దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంట్లో చర్చ జరగాల్సి ఉండగా అలా జరగడం లేదని, పైగా అక్కడ అందరూ మోడీని పొగుడుతున్నారన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టాలా? వ్యవస్థలు ఎలా ఉన్నాయ్‌ ? సెబీ ఎలా ఉన్నది? అని అంతర్జాతీయ పెట్టుబడుదారులు చూస్తారని, పెట్టుబడిదారులు థర్డ్‌ క్లాస్‌ కంట్రీ అంటే దెబ్బతినిపోతామన్నారు. హిడనబర్గ్‌ ఏం స్టడీ చేసిందో.. మనకు తెలియదన్నారు. అదానీ భారతీయ బ్యాంకులు, ఎల్‌ఐసీ పెట్టబడులు పెట్టాయని, ఎల్‌ఐసీలో 25కోట్ల డిపాజిటర్లు ఉన్నారని ,వారంతా ఆందోళనకు గురవుతున్నారన్నారు. ప్రధాని నోటి నుంచి ఒక్కమాట కూడా రాలేదని, ఆయన దోస్తు భాగోతం బయటపడిందనే ఆక్రోశం ప్రధానిలో కనిపించిందన్నారు.

మోడీ, బిజెపి గెలిచారు..ప్రజలు ఓడిపోయారు
బిజెపి అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ 20లక్షల మంది భారతీయ పౌరసత్వం వదిలేసుకున్నారని కెసిఆర్‌ అన్నారు. సిటిజన్‌షిప్‌ వదులుకునే దౌర్భాగ్యం ఏంటో అర్థం కావడం లేదన్నారు. పారిశ్రామికవేత్తలు పోరిపోతున్నారని, పరిశ్రమలు మూతపడుతున్నయని, ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నదనిది. వెరసి 2014లో మోదీ ఏమో చేస్తడని అధికారం అప్పగిస్తే.. పెనం నుంచి పొయ్యిలో కెసిఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మోడీ, బీజేపీ పార్టీ గెలిచిందని, భారతదేశ ప్రజలు ఓడిపోయారన్నారు. దేశ ప్రజల ఓటమిలో భాగంగా తెలంగాణ కూడా కొంత ఓడిపోయిందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీ రూ.13.27కోట్లు అని, వాస్తవంగా మోడీ స్థానంలో ప్లేస్లో మన్మోసింగ్‌ ఉన్నా,కేంద్ర ప్రభుత్వం తెలంగాణ తరహా పని చేసినా జీఎస్డీపీ లక్షల కోట్లు ఉండాల్సిందని, ఒక్క తెలంగాణనే రూ.3లక్షలకోట్లు నష్టపోయిందని తెలిపారు. పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ప్రసంగం ఘోరంగా ఉన్నదని, అదానీ,దేశం ఉనికి ఏమిటో, ఏం జరుగబోతోంది కూడా చెప్పలేదని, ఇప్పుడు భారతదేశం ఏం చేయబోతున్నదని, ఇదే విషయాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ, కాంగ్రెస్‌ ఢిల్లీలో ప్రధానిని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఒక్కమాట మాట్లాడడం లేదన్నారు.

కెసిఆర్‌ పిట్ట కథ
పార్లమెంట్‌లో ఈ వ్యవహారం చూస్తుంటే తనకు ఒక కథ గుర్తుకొస్తోందని సిఎం అన్నారు. “తిరుమల రాయుడనే రాజు ఉన్నాడు. దురదృష్టవశాత్తూ ఆయనకు ఒకటే కన్ను. ఇదే విషయంలో ఆయన బాధపడుతుంటాడు. అదే రాజ్యంలో ఒక కవి కూడా ఉన్నాడు. అతడికి ఏవో సమస్యలు. రాజుగారి దగ్గర బహుమానం పొందాలంటే ఆయన్ను పొగడాలని అందరూ సలహా ఇస్తారు. కవికి అవసరం ఉంది కాబట్టి, ఇష్టం లేకపోయినా ’అన్నాతిగూడి హరుడవు.. అన్నాతిని గూడనపుడు అసుర గురుండవు. అన్నా తిరుమలరాయ కన్నొక్కటే లేదు గానీ, కౌరవపతివే’ అని కవిత్వం చెబుతాడు. అంటే, భార్యతో ఉన్నప్పుడు నువ్వు మూడు కళ్ల శివుడవు. ఆయన భార్య రెండు కళ్లతో కలిపి మూడు కళ్లు కలిగినవాడని అర్థం. ఇక భార్యతో లేనప్పుడు నువ్వు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడంతటి వాడివి. శుక్రాచార్యుడికి ఒక కన్నుమాత్రమే ఉంటుంది కదా! ఆ ఒక్క కన్ను కూడా లేకపోతే నువ్వేమైనా తక్కువ వాడివా ’కౌరవపతి’. అంటే ధృతరాష్ట్రుడంతటి వాడివి’ అని పొగుడుతాడు”అని వివరించారు. ఇలాగే పార్లమెంట్‌లో కూడా ప్రధాని మోడీనుద్దేశించి చి ఇలాగే పొగుడుతున్నారన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments