HomeNewsBreaking Newsసింగరేణిని కాపాడుకుంటాం

సింగరేణిని కాపాడుకుంటాం

ప్రైవేట్‌పరం చేయాలన్న కేంద్రం కుట్రను తిప్పికొడతాం
అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమిస్తాం
మంత్రి కెటిఆర్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌ సింగరేణి సంస్థను సిక్‌ యూనిట్‌గా మార్చి,ఆ తర్వాత తమ అనుయాయులకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహారి స్తోందని పరిశ్రమల శాఖ మంత్రి కెటి.రామారావు విమర్శించారు. సింగరేణిని ప్రయివేటుపరం చేయాలన్న కేంద్రం కుట్రను తిప్పికొట్టేందుకు అన్ని రాజకీయ పక్షాలను కులపుకుని ఉద్యమిస్తామన్నారు.శాసనసభలో
గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో బిఆర్‌ఎస్‌ సభ్యులు బాల్కసుమన్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి కెటిఆర్‌ సమాధానమిచ్చారు. సింగరేణిని కాపాడుకునేందుకు తాము ఎంతదూరమైన వెళ్తామన్నారు. సింగరేణి బొగ్గు గనుల విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులకు సిఎం కెసిఆర్‌ లేఖ రాశారని, నాలుగు బొగ్గు గనులు తమకే ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారన్నారు. నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నామని, వేలంలో పాల్గొనవచ్చని కేంద్రం సమాధానమిచ్చిందని కెటిఆర్‌ వివరించారు. బయ్యారం విషయంలో కేంద్రం మాట తప్పిందని, బయ్యారంలో స్టీల్‌ నిక్షేపాలు లేవని కేంద్ర మంత్రి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రత్యామ్నాయం ప్రారంభించామని, వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరంలో కూడా జిందాల్‌, మిట్టల్‌ తో ప్రాథమికంగా సంప్రదింపులు ప్రారంభించామని,కేంద్రం ముందుకు రాకపోతే ప్రయివేటు రంగం ద్వారానైనా,సింగరేణి ద్వారానైనా బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కెటిఆర్‌ స్పష్టం చేశారు. 2004 నుంచి 2014 వరకు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇసుకపై రూ. 39 కోట్ల 40 లక్షలఆదాయం వస్తే, బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ. 800 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. తెలంగాణ ఇసుక పాలసీని ఇతర రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments