దుబాయ్ నుండి రావల్పిండికి మృతదేహం తరలింపు
దుబాయ్ : పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు, ఆ దేశ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ దుబాయ్‌లో ఆదివారం మరణించారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. ఉరిశిక్ష తప్పించుకునేందుకు దేశం వదిలేసి 2016 నుండీ ఆయన స్వీయ ప్రవాసంలో గడుపుతున్నారు. దుబాయ్‌లో నివసిస్తున్న ముషారఫ్ ఐదేళ్ళుగా చికిత్సకు లొంగని ఎమైలోయిడోసిస్ (అన్ని అవయవాల్లో విపరరీతంగా ప్రోటీన్ చేరిపోవడం) వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన స్థాపించిన ఆల్ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎపిఎంఎల్) 2018 లో ఈ విషయం వెల్లడించింది. ఒక అమెరికన్ ఆసుపత్రిలో చికిత్సపొందుతు ముషారఫ్ మరణించినట్లు పాకిస్థాన్ సైన్యంలోని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది. ముషారఫ్ మృతికి నవాజ్ షరీఫ్ సోదరుడైన పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్,ఇతర సైనిక అధికారులు కూడా సంతాపం తెలియజేశారు. పాక్ త్రివిధ దళాల సంయుక్త కమిటీ ప్రధాన అధిపతి జనరల్ సాహిర్ షంషద్, ఇతర అధికారులు సంతాపాలు తెలిపారు. ముషారఫ్ మృతదేశాన్ని ప్రత్యేక జెట్ విమానంలో దుబాయ్ నుండి పాకిస్థాన్‌లోని రావల్పిండి తరలిస్తారు. కార్గిల్ పర్వతాలను ఆక్ర మించిన ముఫారఫ్ భారత్ మధ్య యుద్ధం (1999 మే జరగడానికి ప్రధాన కారకుడయ్యారు. 2011లో అమెరికాతో జతకట్టి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారు. ఇస్లామిస్ట్ గ్రూపులను అణచివేశారు. ఈ కారణంగా తర్వాతికాలంలో ఆయనపై హత్యాయత్నాలు జరిగాయి. ముషారఫ్ 1943లో ఢిల్లీలో జన్మించారు. భారతదేశంలో అతడి కుటుంబానికి గాఢానుబంధం ఉంది. పర్వేజ్ ముషారఫ్ పూర్వీకులు పొగాకు వ్యాపారులు. పెషావర్ నుండి వచ్చి భారత్‌లో స్థిరపడ్డారు. 18 ఏళ్ళ వయసులో పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలో చేరిన ముషారఫ్ భారత్ సరిహద్దుల్లో పదాతిదళానికి సెంకడ్ లెఫ్టినెంట్‌గా పనిచేశాడు. కశ్మీరుపై యుద్ధంలో పాల్గొన్నాడు. క్రమంగా సైన్యంలో ఉన్నతస్థాయికి ఎదిగాడు. అంచెలంచెలుగా సైన్యంగా ఎదిగిన ముషారఫ్ 1999లో పాకిస్థాన్‌లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారం కైవసం చేసుకున్న ముషారఫ్, ఆ తర్వాత 2001లో దేశ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టాడు. 2008 వరకూ పదవిలో కొనసాగి అవినీతి కేసులలో నిందితుడుగా శిక్షకు గురిఅవుతానన్న భయంతో పదవి నుండి వైదొలగాడు. పాకిస్థాన్ ప్రధానమంత్రి బేనజీర్ భుట్టో హత్య, బలూచిస్థాన్ గవర్నర్, పాకిస్థాన్ దేశీయ సహాయమంత్రి నవాబ్ అక్బర్ బుగ్తి హత్యకేసులో ప్రధాన నిందితుడు ముషారఫ్.
కార్గిల్ యుద్ధకారకుడు జనరల్ ముషారఫ్ మృతి
RELATED ARTICLES