అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి
సిపిఐ జాతీయ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం /తుర్కయంజాల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని,పక్కా ఇంటి నిర్మాణానికి ఈ బడ్జెట్ సమావేశాల్లో ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ జాతీయ కార్యవర్గ చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సిపిఐ అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కుంట్లూరు గ్రామం పాపాయిగూడలో ప్రారంభించిన భూ పోరాట క్షేత్రాన్ని చాడ వెంకటరెడ్డి సందర్శించారు. ఈ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పొట్ట చేత పట్టుకుని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పేదవారు ఇంటి అద్దెలు కట్టేటందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నారన్నారు. సొంత ఇల్లు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం చుట్ట పక్క ప్రాంతంలో ఎన్నో పేద బస్తీలను ఏర్పాటు చేసిన చరిత్ర సిపిఐదని గుర్తు చేశారు. సర్వేనెంబర్ 215 నుంచి 224 వరకు గల భూదాన భూమిలో గుడిసెలు వేసుకుని నేటికీ 14 రోజులు కావస్తుందని, ఇక్కడి ప్రజలకు సరైన మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారని స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంఎల్‌ఎ తీసుకుని వసతులు కల్పించాలని కోరారు. ఇక్కడ భూదానోద్య మ స్ఫూర్తి వినోబా ఆదర్శంతో సిపిఐ భూ పోరా టం నిర్వహిస్తుందని, నిజమైన పేదలు మాత్రమే ఈ పోరాటంలో భాగం పంచుకోవాలని తెలిపా రు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూమి తనదేనంటూ ఆరోపిస్తున్న ప్రైవేటు వ్యక్తులు వెన క్కి వెళ్లాలని వాస్తవ డాక్యుమెంట్లను పరిశీలించి ఇది బోధన భూమిగా ధ్రువీకరించి పేదలకు ఇళ్ల స్థలాలకు పంచాలని రెవెన్యూ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు బహిరంగ సభకు వేల సంఖ్యలో ప్రజలు భవిష్యత్తు ఉద్యమ దిశా నిర్ధ్దేశాన్ని సూచించారు. ఇక్కడ జరుగుతున్న భూ పోరాట తీరుతెన్నులు ప్రజల అవస్థలు వాస్తవాల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి సిపిఐ రాష్ట్ర పార్టీ తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ఇంటి జాగ కోసం సాగుతున్న పేదల పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు చాడా వెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర సమితి సభ్యులు మండల కార్యదర్శి ముత్యాల యాది రెడ్డి, రాష్ట్ర ప్రజానాట్యమండలి కార్యదర్శి పల్లె నర్సింహా ,జిల్లా కార్యవర్గ సభ్యులు సామెడి శేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు స్థానిక కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్,జిల్లా కార్యవర్గ సభ్యులు చందు నాయక్, జిల్లా సమితి సభ్యులు మాజీ కౌన్సిలర్ అజ్మీర్ హరిసింగ్ నాయక్ పాల్గొన్నారు