ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీలు ఖరారు
సికింద్రాబాద్ చైర్‌కార్ టికెట్ ధర రూ. 1,665
ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ టికెట్ ధర రూ.3,120
ప్రజాపక్షం / హైదరాబాద్ తెలుగు రా్రష్ట్రాలైన తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్‌ల మధ్య తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం ప్రారంభం కానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రిమోట్ వీడియో లింక్ ద్వారా జెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. ఈ రైలు వారంలో ఆరు రోజుల పాటు సికింద్రాబాద్ స్టేషన్ నుండి విశాఖపట్నం వరకు నడుస్తుంది. ఈ నెల 16 జనవరి నుండి రైలు సాధారణ సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైలు ప్రయాణ చార్జీలను రైల్వే మంత్రిత్వ శాఖ శానవారం ఖరారు చేసింది. వందే భారత్ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. ఇందులో 14 ఎసి చైర్ కార్లు కాగా, రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్ ఎసి కార్ కోచ్‌లు. ఎగ్జిక్యూటివ్ ఎసి కార్ కోచ్‌లో 104 సీట్లు ఉంటాయి. ఇక ఎకానమీ కాస్‌లో 1,024
సీట్లు ఉంటాయి. మొత్తంగా ఈ రైలులో ఒకేసారి 1,128 మంది ప్రయాణం చేయొచ్చు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు చార్జీల వివరాలు :
స్టేషన్ వివరాలు ఎసి చైర్ కార్ ఛార్జీ ఎగ్జిక్యూటివ్ ఎసి కార్ చార్జీ
సికింద్రాబాద్ విశాఖపట్నం రూ.1,665 రూ.3,120
సికింద్రాబాద్ రాజమండ్రి – రూ.1,365 రూ. 2,485
సికింద్రాబాద్ విజయవాడ జంక్షన్ -రూ.905 రూ.1,775
సికింద్రాబాద్ ఖమ్మం రూ.750 రూ.1,460
సికింద్రాబాద్ వరంగల్ – రూ.520 రూ.1,005
విశాఖపట్నం సికింద్రాబాద్ రూ.1,720 రూ.3,170
విశాఖపట్నం రాజమండ్రికి రూ.625 రూ.1,215
విశాఖపట్నం విజయవాడ జంక్షన్ రూ. 960 రూ.1,825
విశాఖపట్నం ఖమ్మం రూ.1,115 రూ.2,130
విశాఖపట్నం వరంగల్ రూ.1,310 రూ.2,540
నేటి నుంచే ‘వందే భారత్’
RELATED ARTICLES