నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘వీర సింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ : సింహారెడ్డి (సీనియర్‌ బాలయ్య) రాయలసీమకి దేవుడు లాంటి మనిషి. పులిచర్ల ప్రాంతానికి అండగా నిలబడుతూ.. సీమ మంచి కోసం అనుక్షణం తప్పిస్తూ ఉంటాడు. అయితే, వీర సింహారెడ్డికి సవతి చెల్లి భానుమతి (వరలక్ష్మి శరత్‌ కుమార్‌) అంటే ప్రాణం. ఆమె కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తాడు. కానీ భానుమతి మాత్రం వీర సింహారెడ్డి చావు కోసం ముప్పు ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు.. ఇస్తాంబుల్‌లో జయసింహా రెడ్డి (జూనియర్‌ బాలయ్య) తన తల్లి మీనాక్షి (హనీ రోజ్‌)తో లైఫ్‌ లీడ్‌ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈషా (శ్రుతి హాసన్‌)తో జయసింహా ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ సమయంలో జయసింహాకి తన తండ్రి వీర సింహారెడ్డి గురించి తెలుస్తోంది. అసలు తండ్రి కొడుకులు ఎందుకు దూరం అయ్యారు ?, ప్రాణంగా ప్రేమిస్తే.. చెల్లి మీనాక్షి, వీరసింహా రెడ్డిని ఎందుకు చంపాలి అనుకుంటుంది?, చివరకు వీర సింహారెడ్డి కథ ఎలా ముగుస్తుంది ?, జయసింహా రెడ్డి తన తండ్రి కోసం ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ.
ప్లస్‌ పాయింట్స్‌ : సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో నటించిన బాలయ్య బాబు ఎప్పటిలాగే తన నటనతో తన మాస్‌ యాక్టింగ్‌తో ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ లాంటి కొన్ని ఎమోషనల్‌ అండ్‌ యాక్షన్‌ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్‌లో తీవ్రమైన భావోద్వేగాలను పండించిన బాలయ్య నటన సినిమాకే హైలెట్‌గా నిలుస్తోంది. హీరోయిన్‌ గా నటించిన శ్రుతి హాసన్‌ తన గ్లామర్‌తో తన పాత్రకు న్యాయం చేసింది. రోజ్‌ నటన చాలా బాగుంది. ఆమె మంచి నటి అని ఈ సినిమా నిరూపించింది. అలాగే వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తన నటనతో కీలకమైన తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా సెక్‌ండ హాఫ్‌లో వచ్చే ఓ ముఖ్యమైన సీన్‌లో ఆమె నటన చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో విలన్‌ పాత్రలో నటించిన దునియా విజయ్‌ తన వైల్డ్‌ నటనతో మెప్పించాడు. ముఖ్యంగా తన నిజ స్వరూపం గురించి వరలక్ష్మి శరత్‌ కుమార్‌కు చెప్పే సన్నివేశంలో దునియా విజయ్‌ నటన చాలా బాగుంది. కీలక పాత్రలో నటించిన నవీన్‌ చంద్ర కూడా ఆకట్టుకున్నాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. మొత్తమ్మీద బాలయ్య మాస్‌ ప్రేక్షకులకు ఫుల్‌ కిక్‌ ఇచ్చాడు. బాలయ్య డ్యాన్స్‌ కూడా అదిరిపోయింది.
మైనస్‌ పాయింట్స్‌ : మలినేని మంచి మాస్‌ థీమ్‌ తీసుకున్నప్పటికీ.. స్లో నేరేషన్‌తో, కొన్ని చోట్ల ఈ పవర్‌ఫుల్‌ మాస్‌ డ్రామాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. అయితే కొన్ని యాక్షన్‌ సన్నివేశాలతో దర్శకుడు ఆకట్టకునే ప్రయత్నం చేసినప్పటికీ.. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. కంటెంట్‌, ఆర్టిస్ట్‌ల పరంగా చూసుకుంటే సినిమా మీద ప్రేక్షకుడికి పూర్తి స్థాయిలో ఇంట్రస్ట్‌ పుట్టించే స్కోప్‌ ఉన్నపటికీ దర్శకుడు మలినేని గోపీచంద్‌ ఆ ఎలిమెంట్స్‌ను వదిలేసి అనవసరమైన సన్నివేశాలతో సినిమా రేంజ్‌ను కొంత తగ్గించాడు. మొత్తానికి సినిమా నిండా యాక్షన్‌ ఉన్నా.. ప్రేక్షకుడు ఇన్‌ వాల్వ్‌ అయ్యే విధంగా మాత్రం, ఆ యాక్షన్‌ ఉపయో గపడలేదు. అలాగే, కథలోని మెయిన్‌ ఎమోషన్‌ కూడా సరిగ్గా ఎలివేట్‌ కాలేదు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments