HomeNewsBreaking Newsఉత్కంఠపోరులో పోరాడి ఓడిన భారత్‌

ఉత్కంఠపోరులో పోరాడి ఓడిన భారత్‌

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా చివరి వరకు పోరాడి 16 పరుగుల తేడాతో ఓడింది. లంక నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ (65; 31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (51; 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించినా జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు. ఈ విజయంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ లంక 1-1 తేడాతో సమం చేసింది. లంక బౌలర్లలో మధుశంక, రజిత, శనక తలో రెండు వికెట్లు పడగొట్టగా.. చమీకా కరుణరత్నె, వానిందు హసరంగ చెరో వికెట్‌ పడగొట్టారు. సిరీస్‌ నిర్ణయాత్మక పోరు శనివారం రాజ్‌కోట్‌లో జరగనుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ (52; 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకతో బాదగా.. మరో ఓపెనర్‌ నిశాంక (33; 35 బంతుల్లో 4 ఫోర్లు), చరిత్‌ అసలంక (37; 19 బంతుల్లో 4 సిక్స్‌లు) రాణించారు. చివర్లో డాసున్‌ శనక (51;21 బంతుల్లో 2 ఫోర్లు,5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్‌ పటేల్‌ రెండు, చాహల్‌ ఒక వికెట్‌ తీశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments