HomeNewsBreaking Newsఆందోళన వద్దు..

ఆందోళన వద్దు..

ప్రజలకు ఐఎంఎ మార్గదర్శకాలు
ఇప్పటి వరకూ దేశంలో నాలుగు బిఎఫ్‌ 7 కేసులు
జాగ్రత్తలు అవసరం..

ఇప్పటి వరకు మన దేశంలో నాలుగు బిఎఫ్‌.7 కేసులు రిపోర్ట్‌ అయినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, ఒమిక్రాన్‌ నుంచి పరిణామం చెందిన వేరియంట్లు చాలా ఉన్నాయి. అందులో బిఎ.2, బిఎ.5 వేరియంట్లు మిగతా వాటికంటే బలంగా ఉన్నాయి. ఈ బిఎ.5 ఒమిక్రాన్‌ వేరియంట్‌ సబ్‌ లీనియేజ్‌ బిఎఫ్‌.7. ఇది అత్యంత వేగంగా సంక్రమించే స్వభావం కలిగి ఉంది. టీకాలు వేసిన వారికి కూడా ఇన్ఫెక్షన్‌ కలిగించే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇతర కరోనా సబ్‌ వేరియంట్‌ సోకితే కనిపించే లక్షణాలే బిఎఫ్‌.7 సోకినా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, జలుబు, వాంతులు, డయేరియా, ఆయాసం వంటి లక్షణాలు సాధారణంగా బిఎఫ్‌.7 సోకితే కనిపిస్తాయి. అయితే, ఇది వరకే ఆయా వ్యాధుల బారిన పడినవారికి, వ్యాధులతో ఉన్నవారికి లేదా బలహీన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో మాత్రం లక్షణాలు తీవ్రంగా ఉండొచ్చు. బిఎఫ్‌.7 సోకగానే ఆరోగ్యం అనూహ్యంగా క్షీణించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు.

న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరగడం లేదా ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తిచెందడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) స్పష్టం చేసింది. అయితే, జాగ్రత్తలు అవసరమని, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా మాస్కులు ధరించాలని, వివాహాలకు, సమావేశాలకు దూరంగా ఉండాలని గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కొవిడ్‌ -19 కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ఐఎంఎ పలు సూచనలు జారీ చేసింది. తక్షణమే కొవిడ్‌ నిబంధనలను అనుసరించాలని కోరింది. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం.. గత 24 గంటల్లో అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌, బ్రెజిల్‌ వంటి ప్రధాన దేశాల నుండి దాదాపు 5.37 లక్షల కొత్త కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయని ఐఎంఎ తన ప్రకటనలో పేర్కొంది. గత 24 గంటల్లో భారత్‌లో 145 కొత్త కేసులు నమోదయ్యాయని, వీటిలో నాలుగు కొత్త చైనా వేరియంట్‌ బీఎఫ్‌ -7 అని నిర్ధారణ అయిందని వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, అంకితభావంతో కూడిన వైద్య సిబ్బంది, ప్రభుత్వం నుండి మద్దతు, తగినంత మందులు, వ్యాక్సిన్ల లభ్యత కారణంగా భారతదేశం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొగలని స్పష్టం చేసింది. అత్యవసర మందులు, ఆక్సిజన్‌ సరఫరా, అంబులెన్స్‌ సేవలను అందుబాటులో ఉంచాలని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సూచించింది. 2021 నాటి పరిస్థితి తలెత్తితే, ఎదుర్కోవడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని పేర్కొంది. ప్రస్తుతానికి పరిస్థితి ఆందోళనకరంగా లేదని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. రాబోయే కొవిడ్‌ వ్యాప్తిని అధిగమించడానికి పలు సూచనలు పాటించాలని కోరింది. దేశవ్యాప్తంగా 3.5 లక్షల మందికి పైగా వైద్య అభ్యాసకులు కరోనా మహమ్మారితో పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. కొవిడ్‌ నివారణ చర్యల కోసం ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.
ఐఎంఎ సూచించిన మార్గదర్శకాలు..

  1. అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఫేస్‌ మాస్క్‌ లు వాడాలి.
  2. సామాజిక దూరం పాటించాలి.
  3. సబ్బు, నీరు లేదా శానిటైజర్లతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి.
  4. వివాహాలు, రాజకీయ లేదా సామాజిక సమావేశాలు వంటి బహిరంగ సమావేశాలను నివారించాలి.
  5. అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండండి.
  6. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, విరేచనాలు మొదలైన లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
  7. వీలైనంత త్వరగా బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలి.
  8. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసే సలహాలు పాటించండి.
DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments