HomeNewsAndhra pradeshస్వాతంత్య్ర ఫలాలు హరిస్తున్న కేంద్రం

స్వాతంత్య్ర ఫలాలు హరిస్తున్న కేంద్రం

సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి
ప్రజాపక్షం / కామ్రేడ్‌ గురుదాస్‌ దాస్‌ గుప్తా నగర్‌ (విజయవాడ)
సిపిఐకి పూర్వవైభవాన్ని తీసుకురావడమే లక్ష్యమని పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఈ లక్ష్యసాధన దిశగా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని 24వ జాతీయ మహాసభ లు నింపుతాయని ఆకాంక్షించారు. ఈ మహాసభల స్ఫూర్తితో వామపక్ష, లౌకిక ప్రజాతంత్ర శక్తులు సంఘటితమై, రాబోయే ఎన్నికల్లో మోడీని గద్దెదించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్వాతం త్య్ర ఫలాలను మోడీ ప్రభుత్వం హరిస్తోందన్నారు. మహాసభల సందర్భంగా సిపిఐ జెండాను సుధాకరరెడ్డి ఆవిష్కరించారు. ఉద్యమాలకు పురిటిగడ్డ విజయవాడలో సిపిఐ జాతీయ మహాసభలు మళ్లీ జరగడం ఆనందకరమన్నారు. 75 ఏళ్ల
మోడీని గద్దెదించడమే లక్ష్యం
స్వాతంత్య్ర భారతంలో నిరుద్యోగం, దారిద్యం పెరిగిందని, దేశంలో అసమానతలు రోజురోజుకూ అధికంగా పెరుగుతున్నాయని, కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో దేశ సంపదను దోచిపెట్టేందుకు మోడీ సర్కార్‌ పనిచేస్తోందన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని, లౌకికవాదుల గళం నొక్కేందుకు ప్రభుత్వాలు పూనుకున్నాయన్నారు. బిజెపి మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ దేశంలో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజలను విభజించి లబ్ధిపొందాలనే నీచమైన ఆలోచన ఆ వర్గాలదని విమర్శించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల కార్పొరేట్లు అనుకూల ఆర్థిక విధానాలపై వ్యతిరేక వస్తుండటంతో మతోన్మాదం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలని మోడీ ప్రభుత్వం చూస్తున్నదన్నారు. ప్రజాతంత్ర లౌకిక ప్రజాస్వామ్యం ద్వారానే వెనుకబడిన వర్గాలకు, దళితులకు, కార్మికులకు, మహిళలకు మేలు జరుగుతుందని సురవరం సుధాకరరెడ్డి నొక్కిచెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments