ఆరోగ్యంతో నిర్మాణ రంగ మహిళా కార్మికుల చలగాటం
గాలి కాలుష్యం నిత్యం పట్టి పీడిస్తున్నా నోరెత్తని వైనం
ఓ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : గాలి కాలుష్యం నిత్యం పట్టి పీడిస్తూ ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నప్పటికీ కూడా నోరెత్తితే ఉద్యోగం పోతుందన్న భయంతో నిర్మాణరంగంలో ఉన్న 94 శాతం మంది మహిళా కార్మికులు మౌనంగా ఉండిపోతున్నారని ఇటీవలి అధ్యయనం స్పష్టం చేసింది. “గాలి కాలు ష్యం సమస్య గురించి మాట్లాడితే ఆ ఉన్న కూలీ ఉద్యోగం కూడా ఇవ్వరు, అందుకే మౌనంగా ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు” అని ఢిల్లీలో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. దేశంలో ఈ నెల 25న దీపావళి పర్వదినం దగ్గరపడిన తరుణంలో కాలుష్య నిలమైన ఢిల్లీలో మరింత భయంతో ముడుచుకుపోతున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 2021 ప్రపంచ గాలి నాణ్యతా నివేదిక ప్రకారం, ప్రపంచ కాలుష్య నగరాలలో ఢిల్లీ, కోల్కతా, ముంబయి అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ పేదల బతుకులు, వారి శారీరక ఆరోగ్యాలు కూడా అందుకు తగ్గట్టుగానే ప్రమాదకరస్థాయి లో ఉన్నాయి. భయమే మహిళా కార్మికులను నిజం చెప్పనివ్వకుండా, కళ్ళెదురుగా కనిపించే గాలి కాలుష్య సమస్య గురించి మాట్లాడనివ్వకుండా చేస్తోందని సర్వేలో తేలింది. ఈ మహి ళా కార్మికులు, వారి పిల్లల ఆరోగ్యాలపై గాలి కాలుష్యం తీవ్రమైన ప్రభా వం చూపిస్తున్నప్పటికీ వారు నోరు మెదిపి నిజాలు చెప్పడం లేదు. ఎక్కడా సాక్ష్యం చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదు. కారణం వారికి ఆ ఉన్న కనీస కూలి పని కూడా లేకుండా పోతుందన్న భయం! నిర్మాణ రంగంలో పనిచేసే 390 మంది మహిళా కార్మికులను లోతుగా ప్రశ్నించినప్పుడు ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ కార్మికులకు వారి ప్రాధాన్యాలు ఏమిటో వారికి తెలుసు. కానీ ఎంహెచ్టి వారిని సమీకరించి గాలి కాలుష్యంపై వారికి అవగాహన కల్పించి, వారి ఆరోగ్యాలు, వారి పిల్లల ఆరోగ్యాలను రక్షించుకునేందుకు వారినే గొంతెత్తి ప్రశ్నించి స్థానిక ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. స్థానిక ప్రభుత్వాలను ప్రశ్నించడం ద్వారా, వారిపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా విధాన నిర్ణయాలకు, కార్యాచరణకు ప్రజలు మద్దతుగా ఉండాల్సి ఉందని కూడా ఎంహెచ్టి వారికి తెలియజెప్పింది. ఈ సర్వేలో 36 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు సమధానాలు చెప్పడానికి ముందుకు వచ్చారు. వీరిలో ఎక్కువమంది నిరక్షరాస్యులే. కేవలం అక్షరాలు రాయడం వరకూ మాత్రమే చదువుకున్నవారు ఉన్నారు. పైగా వీరిలో ఎక్కువమంది అంటే 87 శాతం మందిషెడ్యూల్డు కులాలు, తెగలు, ఓబిసిలకు చెందినవారే ఉన్నారని కకూడా అధ్యయనంలో పాల్గొన్నవారు వెల్లడించారు.
ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో 85 శాతం మంది మహిళా కార్మికులు గాలి కాలుష్యం సమస్య తమకు తెలుసుననీ, దానివల్ల తమ ఆరోగ్యాలు, తమ పిల్లల ఆరోగ్యాలూ చెడిపోతాయనీ అంగీకరించారు. 75 శాతం మంది తమకు అనారోగ్యంగా ఉంటోందని, దీనికి కాలుష్యమే కారణమని భావిస్తున్నామని అన్నారు. తమ పని ప్రదేశంలో ఆ కలుషితమైన గాలి పీల్చడం వల్ల ఆరోగ్యాలు చెడిపోతాయని తమకు తెలుసునని కూడా వారు పేర్కొంటున్నారు. గాలి కాలుష్యానికి సంబంధించిన ప్రామాణికతల గురించి తమకు తెలియదని వారు అన్నారు. అయితే 94 శాతంమంది మహిళా కార్మికులు ఎన్నటికీ ఈ సమస్య గురించి నోరెత్తే అవకాశం ఉండదని, ఆ సమస్య గురించి వారు ప్రశ్నించబోరని కూడా సమాధానాలు వచ్చాయి. తమ పని తాము చేసుకుపోకుండా అలాంటి ప్రశ్నలు అడిగితే తమ ఉద్యోగాలు పోతాయని రు భయాలు వ్యక్తం చేసినట్లు నివేదిక వెల్లడించింది. అయితే కొందరు మాత్రం కాంట్రాక్టర్లదే పూర్తి బాధ్యత అని వ్యాఖ్యానించారు. అయితే కేవలం ఆరూ శాతం మహిళా కార్మికులు మాత్రం, ఈ గాలి కాలుష్యం వల్ల కలిగే ప్రతికూల ప్రభావం గురించి చర్యలు తీసుకున్నారు. అంటే మాస్కులు ధరించడం, మొహానికి దుపట్టా కప్పుకోవడం, పూర్తిగా శరీరం కనిపించకుండా పూర్తి దుస్తులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించారు.అయితే 90 శాతం కార్మికులు మాత్రం, ప్రభుత్వం రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని, దానివల్ల ఎక్కువ వాహనాలు రోడ్లమీదకు రాకుండా ఉంటే కాలుష్యం తగ్గుతుందని అన్నారు. కాగా, ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమైన అంశం కాదు. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇలాంటి సమస్యలే సాక్షాత్కరిస్తున్నాయి.
కూలీ కోసం…
RELATED ARTICLES